Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్‌ను పక్కన పెట్టి రష్మికతో ఫ్యామిలీ టూర్…?

Vijay Devarakonda : టాలీవుడ్ లో లైఫ్ ఇస్ బ్యూటీఫుల్ అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పెళ్లి చూపులు తో హీరోగా మారి, అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరో ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఈ రౌడీ హీరో గురించి ఎలాంటి వార్తలు వచ్చినా ట్రెండ్ అయి కూర్చుంటుంది. అలాగే హీరోయిన్ రష్మిక మందన్న గురించి కూడా స్పెషల్ గా పరిచయం అక్కర్లేదు. చలో ద్వారా పరిచయమైన ఈ భామ గీతా గోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే గాక టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా నుండే విజయ్ రష్మిక మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కలిసి నటించారు. ఈ రెండు సినిమాలతో వీరి పెయిర్ కి కూడా టాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ రాగా, అప్పటి నుండి ఈ ప్రేమ పక్షుల గురించి ఏ వార్తలు వచ్చినా వైరల్ అవుతున్నాయి. కానీ వీరి లవ్ గురించి ఇప్పటివరకూ ప్రత్యక్షంగా బయట పెట్టలేదు.

తెలిసి తెలియనట్టు?

అయితే చాలా సంవత్సరాల నుండి పలు రకాల పుకార్లు మరియు వారిద్దరి ప్రేమ గురించి వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ విజయ్ దేవరకొండ మరియు రష్మిక తమ ప్రేమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అలా అని వారు కూడా తిరస్కరించలేదు కానీ, సీక్రెట్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ప్రేమ పక్షుల గురించి మరొక అందమైన వార్త వైరల్ అవుతుంది. తాజాగా రష్మిక మందన్న తన పుట్టినరోజును జరుపుకోవడానికి అబుదాబిలోని సర్ బనియాస్ ద్వీపంలోని రిసార్ట్‌లో ఉంది. మరియు ఆమె ఏప్రిల్ 3నే అక్కడికి వెళ్లిందట. ఇక రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇది నా పుట్టినరోజు వారం’ అనే వీడియోను కూడా ఎమోజీతో పంచుకుంది. ఇక అప్పటినుండి విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును జరుపుకోవడానికి త్వరలో ఆమెతో జాయిన్ అవుతాడని వార్తలు వస్తున్నాయి.

అందుకే ఏప్రిల్ 5న రిలీజ్ ?

ఇక విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఫ్యామిలీ స్టార్ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి కూడా కారణం ఇదేనని నెట్టింట చాలా వార్తలు వస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలైన అదే రోజు ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజును జరుపుకోవడానికి యుఎఇ లో ఉంటాడని సమాచారం. ఫ్యామిలీ స్టార్‌కి హిట్ టాక్ వస్తే, విజయ్ మరియు రష్మిక కూడా ఆ సినిమా సెలబ్రేషన్ కూడా జరుపుకుంటారు. ఏది ఏమైనప్పటికీ, నెటిజన్లు వారి రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ నుండి ఎప్పటికక్కపుడు ఓ చూపు చూస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ తన పూర్తి దృష్టిని VD12 వైపు మళ్లించనున్నారు. ఇక రష్మిక మందన్న పుష్ప ది రూల్ విడుదలకు సిద్ధమవుతోంది, ఆ తర్వాత రష్మిక ధనుష్ తో కుబేరుడు లో నటించనుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు