Family Star : ఏరియా వైస్ ఫ్యామిలీ స్టార్ బిజినెస్ లెక్క.. దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడా?

Family Star : టాలీవుడ్ లో లాస్ట్ వీక్ టిల్లు స్క్వేర్ తో భారీ విజయం దక్కగా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొని ఉంది. టిల్లు గానికోసం థియేటర్ల వద్దకు ప్రేక్షకులు బాగానే వస్తున్నారు. ఇప్పుడు ఆ హంగామా రెట్టింపు చేసేందుకు ఫ్యామిలీ స్టార్ రెడీ అయ్యాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫైనల్ గా థియేటర్లలో ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టి చాలా టైం అవుతుంది, కానీ విజయ్ దేవరకొండ మూవీస్ కి బిజినెస్ పరంగా ఎప్పుడూ కూడా సాలిడ్ బిజినెస్ జరుగుతూనే ఉండటం విశేషం. లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు ఖుషి తో వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో పర్వాలేదు అనిపించినా, హిట్ ని మాత్రం అందుకోలేదు. ఇక ఇప్పుడు తనకి గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురామ్ తో కలిసి చేస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

ఫ్యామిలీ స్టార్ థియేట్రికల్ బిజినెస్..

ఇక విజయ్ దేవరకొండ పరశురామ్ ల క్రేజీ కాంబోలో రూపొందిన ఈ సినిమాకు మంచి క్రేజీ బిజినెస్ జరిగిందని చెప్పాలి. ఇక నైజాంలో నిర్మాత దిల్ రాజు ఓన్ గానే సినిమాను రిలీజ్ చేస్తున్నా కూడా, ప్రీవియస్ మూవీస్ బిజినెస్ ల నుండి యావరేజ్ వాల్యూ బిజినెస్ ను కౌంట్ చేయగా ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ రేంజ్ ఈ విధంగా ఉంది. నైజాం 13 కోట్లు, సీడెడ్ 4.5 కోట్లు, ఆంధ్ర 17 కోట్లు కాగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే 34.50 కోట్లుగా డిసైడ్ చేసారు. ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 3 కోట్లు, ఓవర్సీస్ లో 5.5 కోట్లు చేయగా, వరల్డ్ వైడ్ గా 43 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం జరిగింది. మొత్తం మీద సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

బిజినెస్ పరంగా రిస్కేనా?

అయితే ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాకి జరిగిన బిజినెస్ కరెక్ట్ గానే ఉన్నా, విజయ్ దేవరకొండ గత సినిమాల ట్రాక్ రికార్డుని చూస్తే ఎక్కువేమో అనిపిస్తుంది. అయినా కంటెంట్ పరంగా ఈ బిజినెస్ జరిగింది అనుకున్నా, థియేటర్లలో ఆల్రెడీ టిల్లు స్క్వేర్ ఊపు భారీగా ఉన్న నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ ని దింపితే మాస్ ఆడియన్స్ నుండి వసూళ్లు తక్కువ వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఒక వేళ సినిమా తేడా కొడితే బయ్యర్లు భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తో సాలిడ్ హిట్ ని ఎక్స్ పెర్ట్ చేస్తున్నాడు. మరి ఫ్యామిలీ స్టార్ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు