Vishwambhara :వేగంగా చిరు మూవీ షూటింగ్.. కానీ మేకర్స్ దృష్టి పెట్టాల్సింది దానిపైనే?

Vishwambhara : టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలలో ఫుల్ బిజీ గా ఉన్న హీరో ఎవరంటే అది మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. అయితే ఈ ఇయర్ సంక్రాంతి కి ఆల్రెడీ వెంకటేష్, నాగార్జున వచ్చేయగా, వాళ్ళ నెక్స్ట్ సినిమాలు మాత్రం మొదలు కాలేదు. ఇక బాలకృష్ణ బాబీ తో చేస్తున్న సినిమా ఎలక్షన్ల టైం వల్ల బాలయ్య ఆ సినిమాకి బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడని చెప్పొచ్చు. అయితే వరుస సినిమాలు చేయకుండా, ఒక్క విశ్వంభర సినిమాపైనే తన ఫోకస్ మొత్తం పెట్టాడని చెప్పొచ్చు. నిజానికి లాస్ట్ ఇయర్ చిరు నాలుగు సినిమాలను లైన్లో పెట్టగా, భోళా శంకర్ డిజాస్టర్ తో అన్ని సినిమాల్ని క్యాన్సిల్ చేసారు. ముఖ్యంగా రీమేక్ జోలికి పోకూడదని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇక ఇప్పుడు బింబిసార ఫేమ్ వశిస్ట మల్లిడి తో విశ్వంభర చేస్తున్నాడు. ఇక ఈ సినిమా లాస్ట్ ఇయర్ లోనే దాదాపు ఎనిమిది నెలల కింద అనౌన్స్ చేసినా, షూటింగ్ మాత్రం మొదలై మూడు నెలలు మాత్రమే అయింది. అయినా పక్కా స్క్రిప్ట్ తో మొదలుపెట్టి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు.

నాన్ స్టాప్ గా వరుస షెడ్యూల్స్..

ఇక విశ్వంభర రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తర్వాత మొదలవగా, ఒక్కసారి స్టార్ట్ చేసాక ఎక్కడా ఆగకుండా షూటింగ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఒక్కోసారి చిరు అందుబాటులో లేకపోయినా, మిగతా ఆర్టిస్టులకి సంబంధించిన షూట్ పూర్తిచేస్తున్నారు. ఇక ఫస్ట్ షెడ్యూల్ లోనే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్ తీయగా, ఆ తర్వాతి షెడ్యూల్స్ తో హీరోయిన్ త్రిష తో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. మొన్నామధ్య ఊటీ లో కూడా కొన్ని సీన్లను షూట్ చేసారు. ఇక ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ హైదరాబాద్ లింగంపల్లి దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీ లో షూటింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా రామ్ లక్ష్మణ్ నేతృత్వం లో పలు యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ తో పాటు మరో అంశంపై మేకర్స్ గట్టిగా దృష్టి పెట్టాల్సిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

VFX కీలకం?

అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర(Vishwambhara) ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తారని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకని చిత్ర టీమ్ షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. కానీ పలువురు నెటిజన్లు, అలాగే ట్రేడ్ విశ్లేషకులు ఈ సినిమా వీఎఫెక్స్ వర్క్ భారీగా ఉంది కనుక, దానిపై కూడా బాగా ఫోకస్ పెట్టాలని అంటున్నారు. ఎందుకంటే సోసియో ఫాంటసీ మూవీ అంటే గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉంటుంది. పైగా మూవీ అసలే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాలో రెండు పాటలతో పాటు మూడు యాక్షన్ ఎపిసోడ్స్ ని, పలు కీలక సన్నివేశాల్ని కూడా చిత్రీకరించారు. దీంతో సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిందని సమాచారం. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ కల్లా పూర్తి చేసే సంక్రాంతి వరకు కేవలం VFX పైనే దృష్టి పెట్టాలని మేకర్స్ చూస్తున్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు