Geethanjali Malli Vachindi : తెలిసి కూడా ఆ తప్పు రిపీట్ చేస్తారా?

Geethanjali Malli Vachindi: టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి కథాబలం ఉన్న సినిమాలు చేసే హీరోయిన్లలో ముందుండే ఈ భామ పదేళ్ల కింద గీతాంజలి అనే సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమాను రాజ్ కిరణ్ డైరెక్ట్ చేయగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించాడు. అయితే మళ్ళీ పదేళ్ల తర్వాత “గీతాంజలి మళ్ళీ వచ్చింది” పేరుతో సీక్వెల్ తీశారు మేకర్స్. ఇక ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచగా, తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ట్రైలర్ ని గమనిస్తే మాత్రం మేకర్స్ ఆడియన్స్ మర్చిపోయిన కామెడీ హారర్ ని మళ్ళీ పరిచయం చేసేందుకు మేకర్స్ చూస్తున్నారని తెలుస్తుంది. ట్రైలర్ మొత్తాన్ని చూసాక ఎప్పుడూ చూసే రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఈ సినిమా తెరకెక్కిందని తెలిసిపోతుంది. అయితే ఫస్ట్ పార్ట్ లో కాస్త నవ్వించే ప్రయత్నం ఎక్కువ చేసిన మేకర్స్ , ఈ సీక్వెల్ లో ఎక్కువగా భయపెట్టాలని ట్రై చేస్తున్నట్టు అనిపించినా కామెడీ హారర్ సీన్స్ ని డామినేట్ చేస్తుందని అనిపిస్తుంది.

రెగ్యులర్ కథే?

ఇక గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindi) సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ లో ఉన్న సగం మంది ఆర్టిస్ట్ లు ఈ సీక్వెల్ లో కూడా ఉన్నారు. కొత్తగా సునీల్, రవి శంకర్ లాంటి ఆర్టిస్టులు యాడ్ అయ్యారు అంతే. కానీ ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేసినట్టనిపించింది. సినిమాలో కొందరు మూవీ యూనిట్ ఒక హారర్ సినిమా తీయడానికి ఒక పాత పాడుబడ్డ మహల్ కి వెళ్తారు. అక్కడ వాళ్లకి నిజంగా దయ్యాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో అక్కడ వాళ్లకి ఎదురైన ఇబ్బంది ఏమిటి, అసలు ఆ మహల్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఇందులో హీరోయిన్ కి ఏం సంబంధం అనేది కథ. మనం చాలా సార్లు చూసిన సినిమాల్లోని కథే అయినా, డైరెక్టర్ తన స్క్రీన్ ప్లే డ్రామా తో ఎలా ఆకట్టుకుంటాడనేదే సమస్య. అయితే ట్రైలర్ లో ఒక్క సీన్ మాత్రం ఆడియన్స్ కి లేని పోనీ అనుమానాల్ని తెస్తుంది.

క్లైమాక్స్ మైనస్ పాయింట్?

గీతాంజలి2 ట్రైలర్ ఎండింగ్ లో హీరోయిన్ అంజలి ట్రేడిషనల్ డ్రెస్ లో ఉండి ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తారు. అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన చంద్రముఖి 2లో క్లైమాక్స్ లో కూడా దయ్యంగా ఉన్న చంద్రముఖి ఇలాంటి డ్రెస్ లోనే ఫైట్ చేస్తుంది. ఆ సినిమా ఓవర్ గా ఉండగా అది సినిమాకి కూడా మైనస్ అయింది. పైగా సోషల్ మీడియా లో ఎంత ట్రోల్ అయిందో చూసాం. ఇప్పుడు తెలిసి తెలిసి గీతాంజలి 2 లో అలాంటి ఛాయలున్న సీన్ ని ఎలా రిపీట్ చేస్తున్నారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటు ట్రేడ్ విశ్లేషకులు కూడా మూవీ బాగున్నా, క్లయిమాక్స్ సీన్ ఇలా ఉంటే డిజాస్టర్ అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయ్యాక తేలిపోతుంది. ఇక గీతాంజలి ఫస్ట్ పార్ట్ కి రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తే ఈ సీక్వెల్ కి శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు కోన వెంకట్ నిర్మించడమే గాకుండా, స్క్రీన్ ప్లే అందించాడు. ఎంవివి సత్యనారాయణ సహా నిర్మాత గా ఉన్నారు. అంజలి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2024 ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు