Ranbir Kapoor : రణబీర్ గ్యారేజిలోకి కాస్ట్లీ కారు… ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Ranbir Kapoor : బాలీవుడ్‌ స్టార్ రణబీర్‌ కపూర్‌ గతేడాది వచ్చిన యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ కింగ్ గా మారిపోయాడు. అంతకుముందు వరుస డిజాస్టర్లు చవి చూసిన రణబీర్ కు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హిట్ ఇచ్చాడు. 900 కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ నటనకు ఫిల్మ్‌ఫేర్‌తో సహా అనేక అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం ఈ హీరో బాలీవుడ్ రామాయణంలో రాముడి పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రణబీర్ కపూర్ దాదాపు కోట్ల విలువ చేసే లగ్జరీ కారును కొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు రూ.8 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ GT V8 లగ్జరీ కారును కొన్నారు. ముంబై లోని సెలబ్రిటీ హాట్‌స్పాట్ బాంద్రాలో రణబీర్ కపూర్ కారులో సోలోగా రౌండ్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రణబీర్ కార్ల కలెక్షన్ చూస్తే ఫ్యూజులు అవుట్

రణబీర్ కపూర్, అతని భార్య అలియా భట్ ఇద్దరికీ కలిపి దాదాపు డజను కార్లు ఉండగా, తాజాగా వాళ్ళ గ్యారేజీలో మరో కొత్త కారు చేరింది. నిజానికి రణబీర్ కు కార్లంటే పిచ్చి ఇష్టం. అందుకే కొత్త కొత్త కాస్ట్లీ కార్లను తరచుగా కొంటూ ఉంటాడు. గతేడాది సెప్టెంబర్‌లో రూ.3.27 కోట్ల విలువైన ల్యాండ్‌రోవర్ రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేశాడు. అంతకు ముందు రూ. 1.71 కోట్ల విలువైన ఆడి ఎ8 ఎల్‌, రూ. 2.28 కోట్ల విలువైన మెర్సిడెస్ ఎఎమ్‌జి జి-63, రూ. 2.72 కోట్ల విలువైన ఆడి ఆర్8తో సహా లగ్జరీ కార్లను రణబీర్ దగ్గర ఉన్నాయి. అలియా భట్ దగ్గర రూ. 2.8 కోట్ల విలువైన రేంజ్ రోవర్, రూ. 70 లక్షల విలువైన ఆడి A6, 1.8 కోట్ల విలువైన BMW 7 సిరీస్, కొన్ని ఇతర నాన్-ఆడి కార్లు ఉన్నాయి. .

రణబీర్ రెమ్యూనరేషన్

ఈ బాలీవుడ్ స్టార్ ప్రస్తుతం యానిమల్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. యానిమల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 915 కోట్లు కలెక్ట్ చేసింది. యానిమల్ సక్సెస్ కు ముందు రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు రణబీర్ కపూర్. యానిమల్ సినిమాకు 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నెక్స్ట్ రూపొందనున్న రామాయణం కోసం ఆయన పారితోషికం పెంచనున్నట్టు సమాచారం.

- Advertisement -

రణబీర్ సాలిడ్ లైనప్

యానిమల్ సక్సెస్ తో జోరు మీదున్న రణబీర్ ఖాతాలో ప్రస్తుతం అరడజను ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ఎం విక్కీ కౌశల్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో కనిపించనున్నాడు. ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ సీక్వెల్ కూడా ఉంది రణబీర్ చేతిలో. ‘బ్రహ్మాస్త్ర 2’లో రణబీర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు రణబీర్ కపూర్ రామాయణం కూడా చేయాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు