Taapsee:.. తాప్సీ పెళ్లి.. వైరల్ గా మారిన లీక్ వీడియో..!!

Tapsee.. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి గత కొద్దిరోజులుగా ఏదో ఒక వార్త వైరల్ గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె పెళ్లి చేసుకున్నట్లుగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ముఖ్యంగా తన ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ మథీయాస్ బోన్ ను వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి.. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా కూడా గత కొంతకాలంగా తెలియజేస్తూనే ఉంది.. కానీ వీరి పెళ్లికి సంబంధించి ఎలాంటి ఫోటోలు , వీడియోలు మాత్రం ఇప్పటివరకు బయటకి రాలేదు.. అటు తాప్సీ కానీ ఇటు ఆమె ప్రియుడు మథీయాస్ బోన్ కానీ ఈ విషయం పైన స్పందించకపోవడంతో ఇది నిజమే అని అందరూ నమ్మారు కూడా..

తాప్సీ పెళ్లి వీడియో లీక్..
అయితే పెళ్లి వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదనే విధంగా సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో బిజీగానే ఉంది తాప్సీ.. ఇప్పుడు తాజాగా తన పెళ్లికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి వార్తల తర్వాత తొలిసారి తాప్సీ, మథియాస్ బోన్ పెళ్లి వీడియో వైరల్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. తాప్సీ పెళ్లి తన స్నేహితులు , కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా.. వెరైటీగా జరిగినట్టుగా కనిపిస్తోంది.

పెళ్లి దుస్తుల్లో రాజకుమారిలా..
తాప్సీ ఎరుపు రంగు షేర్వానీ సూట్ లో రాజ కుమారి లా కనిపించింది.. అంతేకాదు ఈ దుస్తుల్లో పెళ్లి మండపానికి వస్తూ.. డాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. ఆ తర్వాత తన కాబోయే భర్త మథియాస్ బోన్ ను ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు ఈ వీడియోలో చూపించారు. వీరిద్దరి వివాహం మార్చి చివరలో జరిగినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. ఉదయపూర్ లో ప్రముఖ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగినట్టుగా సమాచారం.. ఇరువురు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే ఈ పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది..

- Advertisement -

తాప్సీ సినీ కెరియర్..
తెలుగు ఇండస్ట్రీలోకి మోహన్ బాబు తనయుడు ప్రముఖ హీరో మంచు విష్ణు హీరోగా వచ్చిన ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.. అయితే తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాదు గత కొన్నేళ్లుగా తాప్సీ తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. తన సినిమాలను తెలుగు భాషలో కూడా విడుదల చేస్తూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది..

తాప్సీ ప్రేమాయణం..
ఇకపోతే తాప్సీ ,మథియాస్ బోన్ ఇద్దరూ కూడా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ప్రేమలో పడినట్టుగా సమాచారం.. 2013లో ప్రారంభమైన ఇండియన్ బ్యాట్మెంటన్ లీగ్ తర్వాత వీరిద్దరికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారిందట.. కొద్ది రోజుల క్రితమే తమ ప్రేమ విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు.. దాదాపుగా వీరిద్దరూ 10 సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం. మరి ఈ పెళ్లి వీడియో పైన తాప్సి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు