Samantha: సామ్ పై సుక్కూ స్పెషల్ ఇంట్రెస్ట్… ప్రతీ సినిమాలో ఆమె ఉండితీరాల్సిందే

Samantha : లెక్కల మాస్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పుష్ప మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిపోయారు సుక్కూ. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తీస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2″పై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. గత కొన్ని రోజుల నుంచి పుష్ప 2లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించబోతోంది అనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంతపై సుకుమార్ స్పెషల్ ఇంట్రెస్ట్ దేనికి? అనే క్యూరియాసిటీ మొదలైంది సినీప్రియుల్లో.

ప్రతి సినిమాలో సమంత ఉండి తీరాల్సిందే…
టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ కూడా ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అందులో హీరోగా నటించిన రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. సుకుమార్ స్టైల్ మేకింగ్, రామ్ చరణ్ యాక్టింగ్, పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. 2018లో రిలీజ్ అయిన రంగస్థలం మూవీ 210 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చిట్టిబాబుగా నటించగా, హీరోయిన్ సమంత రామలక్ష్మి పాత్రలో కనిపించి మెప్పించింది. ముందుగా ఈ మూవీకి సమంతను వద్దు అనుకున్నారట సుకుమార్. ఇద్దరు స్టార్లను సెట్స్ లో హ్యాండిల్ చేయలేనేమో అనే అనుమానంతో కొత్త హీరోయిన్ ను తీసుకుందామని డిసైడ్ అయ్యారట.

కానీ గ్రామీణ అమ్మాయి పాత్రకు సమంత సరిగ్గా సరిపోతుందని ఆలోచించి, తన నిర్ణయాన్ని మార్చుకున్నారట సుకుమార్. సెట్స్ లో సమంత నటన చూసి ఆయన మంత్రముగ్ధుడు అయ్యారట. ఈ సినిమా తర్వాత తను మూవీస్ తీసినంత కాలం సమంతను తన సినిమాలోకి తీసుకుంటూనే ఉంటానని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఆమె వయసుకు తగ్గ పాత్రలతో ప్రతిసారి సమంతకు చాన్స్ ఇవ్వాలని అనుకున్నాను అని సుకుమార్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఇదే సమంతపై సుకుమార్ కు ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్. అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. పుష్ప మూవీలో కూడా సమంతను స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారు సుక్కూ. ఇప్పుడు మరోసారి సీక్వెల్ లో కూడా సమంత మెరుస్తుంది అనే టాక్ మొదలైంది.

- Advertisement -

సుకుమార్, సమంత సినిమాల విషయానికి వస్తే… లెక్కల మాస్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఈ మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ తో నెక్స్ట్ మూవీని ప్లాన్ చేసుకున్నారు సుకుమార్. మరోవైపు సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే అల్లు అర్జున్, అట్లీ మూవీలో సమంత హీరోయిన్ గా ఎంపికైన వార్త చక్కర్లు కొడుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు