Okkadu VS Ghilli : “ఒక్కడు” తమిళ రీమేక్ రీ రిలీజ్… కలెక్షన్స్ లో టాప్ ఎవరంటే?

Okkadu VS Ghilli : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఒక్కడు మూవీ ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్లాక్ బస్టర్ మూవీని “గిల్లి” పేరుతో కోలీవుడ్ స్టార్ విజయ్ తమిళ్ లో రీమేక్ చేశారు. తమిళ తంబీలకు కూడా ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమాల ప్రస్తావన ఎందుకు అంటే గిల్లి మూవీ రీ రిలీజ్ కాబోతోంది. మరి గిల్లి మరోసారి ఎప్పుడు థియేటర్లలోకి రాబోతోంది? అప్పట్లో ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఎంత? అనే ఆసక్తికరమైన విషయంలోకి వెళ్తే….

గిల్లి రీ రిలీజ్ ఎప్పుడంటే ?

దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన గిల్లి మూవీ తమిళంలో ఏప్రిల్ 20న రీ రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఒక్కడు టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, భూమిక జంటగా నటించిన విషయం తెలిసిందే. ఒక్కడు మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహించగా ఎమ్మెస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. 2003 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కడు మూవీ మహేష్ బాబు కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఏడాది తర్వాత ఈ మూవీనే తమిళ దర్శకుడు ధరణి గిల్లి పేరుతో తమిళ్ తంబీల ముందుకు తీసుకువచ్చాడు. ఏఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరించగా, డైరెక్టర్ ధరణి తమిళ తమ్ముళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఒక్కడు మూవీని మార్చి గిల్లి పేరుతో హిట్ కొట్టారు. 2004లో రిలీజ్ అయిన గిల్లి మూవీకి విజయ్ నటన, యాక్షన్ సన్నివేశాలు, డైరెక్టర్ ధరణి మేకింగ్, విద్యాసాగర్ సంగీతం, పాటలు, బిజిఎం అన్ని అల్టిమేట్ గా కుదిరాయి. అలాగే విజయ్, త్రిషల మధ్య కెమిస్ట్రీ హైలెట్ అని చెప్పొచ్చు. ప్రకాష్ రాజ్ తెలుగుతో పాటు తమిళ వెర్షన్ లో కూడా విలన్ గా నటించి మెప్పించారు. మొత్తానికి మరోసారి గిల్లి మూవీని థియేటర్లలో చూడడానికి విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కలెక్షన్స్ పరంగా తోపు ఎవరంటే?

వాస్తవానికి ఏదైనా సినిమా రీమేక్ వస్తుందంటే పోలికలు పెట్టడం అనేది సర్వసాధారణం. అలాగే మహేష్ బాబు ఒక్కడు, విజయ్ గిల్లి మూవీకి కూడా అదే జరుగుతోంది. గిల్లి మూవీ రీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ఎంత? అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక్కడు మూవీ 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ మూవీ 21.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక గిల్లి మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే… 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో 31.50 కోట్లు కొల్లగొట్టింది. కేరళలో 4.20 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1. 50 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ మూవీ 5.50 కోట్లు సాధించింది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 42.70 కోట్ల గ్రాస్ రాబట్టింది గిల్లి మూవీ. అంతేకాకుండా 2004లో హైయ్యెస్ట్ గ్రాస్ రాబట్టిన తమిళ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు