Mrunal Thakur: ఆ హీరోపై మోజుపడుతున్న మృణాల్ ?

Mrunal Thakur Favourate :  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. వాస్తవానికి హీరోయిన్ మృనాల్ ఠాకూర్ బాలీవుడ్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. కానీ అక్కడికంటే ఇక్కడ బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సౌత్ ఇండియా ను ఈ బ్యూటీ ఏలుతుందని కూడా మనం అనుకోవచ్చు.

దీనికి కారణం బాలీవుడ్ ఇండస్ట్రీలో కంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur Favourate ) కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వద్దన్నా కూడా ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఈ బ్యూటీ. సింపుల్గా చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయి మంచి క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్ మృనాల్ చేసిన మొదటి సినిమా సీతారామం.

mrunal-thakur-lucky girl sentiment for Family Star
mrunal-thakur-calls-dulquer-salmaan-her-favourite-co-star

ఈ సినిమా గత రెండు సంవత్సరాల కిందట వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా మృనాల్ ఠాకూర్ పనిచేయగా దుల్కర్ సల్మాన్ హీరోగా కనువిందు చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మెదులుతూ ఉంటుంది. అంతలా ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇందులో ఎంతో సాంప్రదాయ బద్ధంగా చీరకట్టులో కనిపించింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. కానీ ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్లీ అందాలు ఆరబోయడం ప్రారంభించేసింది మృణాల్.

- Advertisement -

ఇక ఇటీవల నాచురల్ స్టార్ నాని హీరోగా చేసిన హాయ్ నాన్న సినిమాతో మరో బంపర్ హిట్ కూడా అందుకుంది సీతారామం బ్యూటీ సీత మహాలక్ష్మి. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే రిలీజ్ కాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ మృనాల్ ఠాకూర్.

తనతో నటించిన వారితో తనకు ఇష్టమైన కోస్టార్ దుల్కర్ సల్మాన్ అని హీరోయిన్ మృనాల్ ఠాకూర్ వెల్లడించారు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ ఈవెంట్ లో ఈ బ్యూటీ మాట్లాడారు. సీతారామన్ షూటింగ్ సమయంలో దుల్కర్ అడుగడుగునా తనకు ధైర్యం ఇచ్చాడని ఈ సందర్భంగా వెల్లడించారు హీరోయిన్ మృనాల్ ఠాకుర్. ఆయన వల్లే సీత పాత్ర చేయగలిగానని చెప్పారు. పలు భాషలలో నటిస్తున్నానంటే దానికి కారణం దుల్కర్ సల్మాన్ ఇచ్చిన స్ఫూర్తి అని స్పష్టం చేశారు.

దుల్కర్ సల్మాన్ సహాయం లేకపోతే తాను తెలుగులో ఇంత బాగా నటించే దానిని కాదని వెల్లడించారు. అలాంటి వ్యక్తి తనకు పరిచయం కావడం ఎంతో గొప్ప విషయమై చెప్పుకొచ్చారు. ముందు ముందు అతనితో సంబంధాలు కొనసాగిస్తానని కూడా ఇండైరెక్టుగా చెప్పేశారు. తాను తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు హీరోయిన్ మృణాల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు