Raashii Khanna : ఆ ఒక్క కారణం చెప్పి… ఇబ్బంది పడుతున్న రాశి !

Raashii Khanna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు చాలామంది ఉంటారు. మన తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో కొంతమంది తమ బ్యాగ్రౌండ్తో ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు. మరి కొంతమంది ఎక్స్పోజింగ్ చేసి టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లలో రాశి కన్నా ఒకరు.

హీరోయిన్ రాశి కన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందంతోపాటు అభినయం రాసి కన్నా సొంతం. ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు మంచి సక్సెస్ అందుకున్నాయి. దీంతో ఈ బ్యూటీ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ పెరిగిపోయింది. అక్కడ కూడా వరుసగా వెబ్ సిరీస్ లు అలాగే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది హీరోయిన్ రాశి కన్నా.

ఇక హీరోయిన్ రాశి కన్నా పర్సనల్ విషయానికి వస్తే… ఈ బ్యూటీ ఢిల్లీలో పుట్టి పెరిగింది. అక్కడే ఉన్నత చదువులు చదువుకొని ఆ తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2013 సంవత్సరంలో మొదటగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మద్రాస్ కెఫే అనే సినిమాలో నటించింది అందరిని మెప్పించింది రాశి కన్నా. ఆ తర్వాత తెలుగులో మనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రాశి కన్నా. ముఖ్యంగా 2014 సంవత్సరంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది హీరోయిన్ రాశి కన్నా.

- Advertisement -

ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా హిట్లు కొట్టాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రాసి కన్నా. ఇప్పటివరకు హీరోయిన్ రాశి కన్నా పదుల సంఖ్యలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. ఇందులో చాలామంది స్టార్ హీరోలే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ, మాస్ మహారాజు రవితేజ తో రాజా ది గ్రేట్, వరుణ్ తేజ్ తో తొలిప్రేమ, సాయి ధరమ్ తేజ్ తో ప్రతిరోజు పండగే, లాంటి ఎన్నో సినిమాలు చేసింది.

అటు వెంకటేష్ మరియు నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన వెంకీ మామ సినిమాలో కూడా నటించి అందరిని మెప్పించింది హీరోయిన్ రాశి కన్నా. ఇటు విజయ్ దేవరకొండ హీరోగా చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ లో కూడా నటించింది రాశి కన్నా. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీ దూసుకుపోతుంది. ఇక 33 సంవత్సరాలు ఉన్న ఈ బ్యూటీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎవరితో కూడా ఎఫ్ ఫైర్ లు పెట్టుకున్నట్లు వార్తలు రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ రాశి కన్నా.

పెళ్లి అనేది ఒక పెద్ద విషయం అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడే పెళ్లి ఏంటి… దానికి చాలా సమయం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం తన కెరీర్ పై దృష్టిపెట్టానని… ఆ తర్వాత పెళ్లి అంటూ వ్యాఖ్యానించింది హీరోయిన్ రాశి కన్నా ( Raashii Khanna ). దీంతో ఆమె కామెంట్స్ విన్న ఫ్యాన్స్ తమకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అని కొంతమంది అంటూ ఉంటే… ఎవరితో అయినా ఎఫ్ ఫైర్ పెట్టుకున్నావా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు