Vijay Devarakonda : ఒక చక్కటి కవర్ డ్రైవ్

Vijay Devarakonda : నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. నాగ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ చేసిన రిషి పాత్ర చాలామందికి బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్ర తర్వాతనే సందీప్ రెడ్డి వంగకి అర్జున్ రెడ్డి అనే పాత్రకి విజయ్ సరిపోతాడు అని ఒక నమ్మకం కలిగింది.

విజయ్ దేవరకొండ కి హీరోగా మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా మాత్రం పెళ్లి చూపులు. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఆ సినిమా. సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమా చిన్న సినిమాగా మొదలైన పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది. కానీ తరుణ్ మాత్రం తనకు నచ్చినట్టుగా సినిమాలు చేస్తూ, తనకు నచ్చిన పని చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. తరుణ్ ఇప్పటివరకు తన కెరియర్ లో మూడు సినిమాలు మాత్రమే చేశాడు. అలాగే నటుడుగా కూడా తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడని చెప్పొచ్చు.

నాగ్ అశ్విన్ గురించి ప్రస్తుతం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహానటి సినిమాతో తన టాలెంట్ ఏంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. దాదాపు ఆడియన్స్ సినిమా థియేటర్ కి రావడం మానేసారు అనుకున్న తరుణంలో ఒక మంచి సినిమా తీస్తే ఆడియన్స్ వెతుక్కుని మరి సినిమాకు వస్తారు అని నిరూపించాడు. ఇకపోతే మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా కల్కి. మహానటి సినిమా తర్వాత నాగి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ఇకపోతే సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించి తిరుగులేని డైరెక్టర్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నే కాకుండా బాలీవుడ్ లో కూడా స్థిరపడిపోయాడని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సందీప్ రెడ్డి. విజయ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ముగ్గురు కొత్త డైరెక్టర్స్ తో పని చేశాడు. ఈ ముగ్గురిలో ఇద్దరు దర్శకులు ప్రభాస్ తో వర్క్ చేస్తున్నారు.

ఇక విజయ్ విషయానికి వస్తే విజయ్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు రకాలు ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఒక ఇంటర్వ్యూ లో విజయ్ మాట్లాడుతూ డెబ్యూ డైరెక్టర్స్ తో ప్రస్తుతం నేను సినిమా చేయడానికి సిద్ధంగా లేనని చెప్పుకొచ్చాడు. బడ్జెట్ ను వాళ్ళు కంట్రోల్ చేయలేరని సెట్స్ లో మేనేజ్ చేయలేరంటూ చెప్పుకొచ్చాడు విజయ్.

ఇదే ప్రశ్న గురించి ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు మరింత క్లారిటీగా సమధానం ఇచ్చాడు విజయ్ ( Vijay Devarakonda ). నేను చాలామంది కొత్త డైరెక్టర్స్ తో చేశాను. మళ్లీ ఇప్పుడు నేను కొత్త డైరెక్టర్లతో చేస్తే, కొత్త యాక్టర్స్ ఎక్కడి నుంచి బయటకు వస్తారు.? కొత్త డైరెక్టర్స్ , కొత్త యాక్టర్స్ వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది అన్నట్టు తన వైపు నుంచి చెప్పుకొచ్చాడు విజయ్. ఇకపోతే విజయ్ చెప్పిన ఈ మాటలు కొంతమందికి వ్యాలిడ్ అనిపించినా కూడా, కవర్ చేయడానికి ఇలా చెప్తున్నాడు అంటూ కొంతమంది చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు