Family Star Release Date : అన్నిటికంటే రిలీజ్ డే స్పెషల్

Family Star Release Date : ఇండస్ట్రీలో జరిగే చాలా విషయాలు ప్రేక్షకులకు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. అయితే ఒక హీరోతో ఒక దర్శకుడు సినిమా చేయబోతున్నాడు అని ఆ హీరో కంటే ముందే కూడా చాలామంది ప్రేక్షకులకు తెలుస్తాయి అన్న కూడా ఆశ్చర్యం లేదు. అలానే ఇద్దరు హీరో హీరోయిన్ల మధ్య ఏదో జరుగుతుంది అనే విషయం కూడా అంతే ఫాస్ట్ గా ప్రేక్షకులకు తెలుస్తుంది. చాలామంది హీరోలు తమ యాక్టర్స్ తో ప్రేమలో పడుతూ ఉంటారు ఆ ప్రేమలు పెళ్లిళ్ల వరకు దారితీస్తాయి.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ప్రేమ జంటలు ఉన్నారు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైనా సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన మొదటి హీరో నాగచైతన్యతో కొంతకాలం పాటు ప్రేమాయణం సాగించి ఎట్టకేలకు వారిద్దరూ ఒక్కటై పెళ్లి చేసుకొని తర్వాత వారికున్న అనివార్య కారణాల వలన వాళ్ళు విడాకులు కూడా తీసుకున్నారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది యాక్ట్రెస్ వాళ్ళ లవ్ స్టోరీని బయటకు తెలియనివ్వకుండా సీక్రెట్ గా ఉంచడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక లవ్ స్టోరీ బయటికి తెలియకుండా మెయింటెన్ చేయటం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని చాలా సక్సెస్ఫుల్గా అచీవ్ చేశాడు వరుణ్ తేజ్. లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్ అది మీడియా గానీ చాలామంది ప్రేక్షకులకు గాని తెలియకుండా పగడ్బందీగా నడిపాడు. కేవలం ఎంగేజ్మెంట్ కి వారం రోజులు ముందుగానే చాలామందికి ఈ విషయం తెలిసింది.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మరో యంగ్ జంట అంటే విజయ్ దేవరకొండ రష్మిక అని చెప్పొచ్చు వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి అధికారికంగా ప్రకటించకపోయినా కూడా చాలాసార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. ఓకే లొకేషన్ లో ఇద్దరివి వేర్వేరు ఫోటోలు కనిపించడం. మాల్దీవ్స్ లో ఫొటోస్ కనిపించడం. ఎయిర్పోర్ట్ లో కనిపించడం. ఇవన్నీ కూడా వీరిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ కి ప్రూఫ్స్ అని చెప్పొచ్చు.

ఇకపోతే రీసెంట్ గా యానిమల్ అనే సినిమాలో నటించింది రష్మిక. ఈ సినిమా టీం తెలుగు ప్లాట్ ఫామ్ నిర్వహించిన అన్ స్టాపబుల్ షో కి హాజరైంది. ఆ షో లో రష్మిక విజయ్ కు కాల్ చేయటం అక్కడితో కొంతమేరకు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కి సిద్ధంగా ఉంది ( Family Star Release Date ). ఈ సందర్భంగా కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ.

ఈ తరుణంలో కొంతమంది లేడీస్ తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు విజయ్. అయితే ఈ సినిమా చేయటం ఒక ఎత్తు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మంచి ప్రత్యేక మంటూ చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఉన్నవాళ్లు ఈరోజుకి ఏమైనా ప్రత్యేకత ఉందా అని అడిగినప్పుడు హాలిడే అంటూ నవ్వుతూ చెప్పాడు. ఇకపోతే అదే రోజు రష్మిక మందన్న బర్త్డే ఉందని ఒకమె అనగా, ఈ బర్త్ డే కి తమకు కలిసి రావాలని చెప్పొచ్చాడు విజయ్. ఏదేమైనా కూడా త్వరలో వీరిద్దరూ కలిసి తమ ప్రేమ గురించి అధికారంగా ప్రకటించి పెళ్లి పీటలేకపోతున్నారని చాలామంది ఊహిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు