Vijay Devarakonda : డెబ్యూ డైరెక్టర్స్ తో పని చేయడం నాకు ఇష్టం లేదు

Vijay Devarakonda : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే చాలామంది బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలానే విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకొని నేడు ఒక స్టార్ హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. ముందుగా చిన్నచిన్న సినిమాల్లో కొన్ని పాత్రలు చేసిన విజయ్ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో కంప్లీట్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన నమోదు చేసుకొని తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరిచాయి.

ఇకపోతే విజయ్ దేవరకొండ చాలామంది దర్శకులతో పనిచేశాడు. అయితే కొందరు కొత్త దర్శకులు విజయ్ దేవరకొండకు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. పూరీ జగన్నాథ్ లాంటి సీనియర్ డైరెక్టర్ విజయ్ కెరియర్ లో డిజాస్టర్ అందించాడు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి డిజాస్టర్ కు గురైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ.

రీసెంట్ గా పాల్గొన్నా ఒక ఇంటర్వ్యూలో డెబ్యూ డైరెక్టర్ గురించి ఒక సంచలమైన వ్యాఖ్యలను చేశాడు విజయ్. డెబ్యూ డైరెక్టర్లతో పని చేయటం గురించి మీరు ఏం చెప్తారు అని యాంకర్ అడిగినప్పుడు దానికి సమాధానం గా ప్రస్తుతం నేను డెబ్యూ డైరెక్టర్లతో పని చేయాలనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. డెబ్యూ డైరెక్టర్లు సెట్ ని హ్యాండిల్ చేయలేరని, ఆ బడ్జెట్ను కరెక్ట్ గా వాడలేరంటూ ఎక్స్పీరియన్స్ అవసరం అంటూ పలు రకాలుగా తనదైన వే లో చెప్పుకొచ్చాడు విజయ్. ఏదైనా విజయ్ చేసిన ఈ కామెంట్స్ ని కొందరు ట్రోల్ చేస్తుంటే మరికొందరు యాక్సెప్ట్ చేస్తున్నారు.

- Advertisement -

ఇకపోతే విజయ్ తన కెరియర్ లో ఇప్పటివరకు ముగ్గురు కొత్త డైరెక్టర్లతో పని చేశాడు. వీళ్ళ ముగ్గురు కూడా విజయ్ కెరియర్లో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన వాల్లే. చిన్న చిన్న సినిమాలు చేస్తున్న విజయ్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చిన సినిమా మాత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ దర్శకులలో నాగ అశ్విన్ కూడా ఒకరిని చెప్పొచ్చు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు తరుణ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన హిట్ గా మారింది. ఆ తర్వాత తరుణ్ చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా మంచి హిట్ అయింది. రీసెంట్ గా వచ్చిన కీడా కోలా కూడా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు తరుణ్ భాస్కర్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే చాలామంది యూత్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉంటారు.

ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్లో సంచలనానికి తెరతీసిన తెలుగు దర్శకుడు అంటే సందీప్ రెడ్డి వంగా అని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన అనిమల్ సినిమా ఎంత సంచలనాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఈ స్థాయిలో ఉండటానికి కారణం కూడా సందీప్ రెడ్డి వంగా అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమా అంత హిట్ అయింది. అయితే తన కెరీర్ లో ముగ్గురు డెబ్యూ డైరెక్టర్స్ తో పనిచేసిన విజయ్ కి ముగ్గురు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్స్ తో పని చేయడం నాకు ఇష్టం లేదు అని విజయ్ చేసిన కామెంట్స్ చాలామంది యాక్సెప్ట్ చేయడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు