Manushi Chiller : మిస్ వరల్డ్ ఆశలన్నీ దీనిపైనే!

Manushi Chiller : బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా హీరోయిన్లకు ఒక్క హిట్ వచ్చిందంటే చాలు పదేళ్లయినా అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ ప్లాపులు వస్తే అదే సినిమావాళ్లు ఐరన్ లెగ్ ట్యాగ్ వేసి పంపిస్తారు. అయితే గ్లామర్ హీరోయిన్లకు మాత్రం అవకాశాలకు కొదవలేదు అంటారు. అందుకే చాలా మంది హీరోయిన్లు తన అందచందాలతో యూత్ ని అట్రాక్ట్ చేస్తూ హిట్టు లేకపోయినా అలా నెట్టుకొస్తారు. కానీ అందరికీ ఆ టాలెంట్ కూడా ఉండదుగా. కొందరు భామలకు టాలెంట్ ఉన్నా దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం తెలీదు. మరికొందరికేమో ఎంత అందం ఉన్నా అదృష్టం కలిసి రాదు. అదే సినిమా ఇండస్ట్రీలో ఎంత గ్లామర్ హీరోయిన్ అయినా కూడా లక్ కలిసి రావాలి. అలాగే ఒక హిట్టు బొమ్మ కూడా పడాలి అంటారు. అలా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి ఏదో ఏలేస్తామనుకొని ఎంట్రీ ఇచ్చి ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్న హీరోయిన్లలో మానుషీ చిల్లర్ కూడా ఒకరు. నిజానికి ఈ భామ సినిమాల్లో కంటే ముందే నేషనల్ వైడ్ గా పాపులర్.

మిస్ వరల్డ్ బ్యూటీ కష్టాలు..

హర్యానా కి చెందిన ఈ భామ 2017 లో మిస్ ఇండియా కాగా, అదే సంవత్సరం ఏకంగా మిస్ వరల్డ్ బ్యూటీ కిరీటాన్ని తెచ్చుకుంది. అప్పుడే సినిమా డైరెక్టర్లకి, నిర్మాతల్ని తెగ ఆకర్షించింది. ఇక ఈ అమ్మడికి కూడా సినిమాలంటే తెగ మోజు ఉండడంతో 2022 లో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృత్వి రాజ్ సినిమాతో హీరోయిన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఎంత గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిందో, అంత కంటే ఘోరంగా మూవీ ప్లాప్ అయింది. కానీ మానుషీ ఎంతైనా ప్రపంచ సుందరి కదా అని ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అలా లాస్ట్ ఇయర్ ఓ కామెడీ సినిమాతో వచ్చి ప్లాప్ అందుకుంది. ఇక ఈ ఇయర్ ఆపరేషన్ వాలెంటైన్ తో సక్సెస్ ఫుల్ గా హ్యాట్రిక్ ప్లాప్ ను ఖాతాలో వేసుకుంది. తన అందంతో మిస్ వరల్డ్ అయిన ఈ బ్యూటీకి సినిమాల్లో హిట్లు అంటే దానికి వేరే టాలెంట్ కూడా ఉండాలని అర్థమయిందో లేదో గాని, లక్ మాత్రం ఈ అమ్మడికి ఫేవర్ గా మారడం లేదు.

ఈ సినిమాపైనే అన్ని ఆశలు..

ఇక మానుషీ ఆశలన్నీ బాలీవుడ్ యాక్షన్ మూవీ పైనే ఉన్నాయి. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘బడే మియాన్ చోటే మియాన్‘ . ఈ సినిమాలో మానుషి చిల్లర్ ఒక హీరోయిన్ గా కెప్టెన్ మిషా అనే పాత్రలో నటించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంది. అయితే సినిమాలో మానుషీ ( Manushi Chiller ) కి మరి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉన్నట్టు కనిపించడం లేదు, కానీ ముందుగా ఈ బ్యూటీ కి ఒక హిట్టైన ఖాతాలో పడాలి. ఇక ఈ ప్రపంచ సుందరి ఆశలన్నీ ఈ సినిమా పైనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎలాగో బడా మూవీ కాబట్టి ఈ సినిమా హిట్ అయితే ముందు ఆ ఐరన్ లెగ్ ట్యాగ్ పోయి, మంచి అవకాశాలు వస్తాయని ఈ బ్యూటీ ఆశతో ఉంది. మరి చూడాలి ప్రపంచ సుందరిగా కలిసొచ్చిన అదృష్టం ఈ సినిమాకి కూడా వస్తుందో లేదో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు