Suma kanakala : కొడుకు కోసం సంచలన నిర్ణయం తీసుకున్న యాంకర్ సుమ..!!

Suma kanakala : బుల్లితెర యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న సుమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. స్టార్ మహిళ, జీన్స్, పంచావతారం , సూపర్ సింగర్ , భలే చాన్సులే, లక్కు కిక్కు, పట్టుకుంటే పట్టు చీర ,అవాక్కయ్యారా, క్యాష్ వంటి ఎన్నో షోలతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపును సొంతం చేసుకుంది.. ఇక టాలీవుడ్ స్టార్ హీరోల ప్రీ రిలీజ్ కార్యక్రమాలకైతే తప్పనిసరిగా సుమా ఉండాల్సిందే.. అంతలా పాపులారిటీని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సెలబ్రిటీలు తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే..

వారసుడిని పరిచయం చేసిన సుమ..

ఈ క్రమంలోనే యాంకర్ సుమ కూడా తన కొడుకు రోషన్ ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది.. రీసెంట్గా తెరకెక్కిన బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రోషన్ కనకాల. ఇందులో మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది.. ఇక ఈ నేపథ్యంలోనే కొడుకు కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుందట సుమ.. రోషన్ కనకాల రెండవ సినిమా విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని సమాచారం..

కొడుకు కోసం ఆ హీరోయిన్ కి కోట్లు..

ఇందుకోసం సుమ ( Suma kanakala ) ఒక హీరోయిన్ కి కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చైనా సరే తన కొడుకు సినిమాలో ఫిక్స్ చేయాలని నిర్ణయించుకుందనే వార్తలు తెరపైకి వస్తున్నాయి.. ఇక ఆమె ఎవరో కాదు బేబీ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన వైష్ణవి చైతన్య.. ఆల్రెడీ రోషన్ తన రెండో చిత్రానికి సంబంధించి సైన్ చేయగా అందులో వైష్ణవి చైతన్యను హీరోయిన్ గా తీసుకోవాలనే ప్లాన్లో సుమా ఉందని.. వైష్ణవిని బాగా రిక్వెస్ట్ చేయడంతో చివరికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

- Advertisement -

సుమపై నెటిజన్స్ ట్రోల్స్..

ఇక మరి కొంతమంది ఈ విషయం తెలిసి సుమాపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు..మీ కొడుకులో టాలెంట్ ఉంటే ఇలా హీరోయిన్స్ ని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు.. ముందు మీ కొడుకుకి యాక్టింగ్ పూర్తిస్థాయిలో నేర్పించండి అంటూ కామెంట్లు చేయడం గమనార్హం..

వైష్ణవి చైతన్య కెరియర్..

ఇక వైష్ణవి చైతన్య కెరియర్ విషయానికి వస్తే.. మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆల్బమ్ సాంగ్స్ తో పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జష్వంత్ తో కలిసి చేసిన ఒక షార్ట్ ఫిలిం తో మరింత క్రేజ్ దక్కించుకుంది.. ఇక తర్వాత విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతోనే హీరోయిన్గా ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి.. ఇకపోతే ఈ సినిమాలో నటించక ముందు ఎంతోమంది స్టార్ హీరోలకు చెల్లి పాత్రలో నటించి మెప్పించిన వైష్ణవి చైతన్య ఇప్పుడు హీరోయిన్గా మెప్పించడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.. ఇక ఈమె టాలెంట్ కి మంత్రముగ్ధురాలైన సుమ.. ఈమెను తన కొడుకు పక్కన నటింపచేయాలని.. అందుకోసం కోట్లు కుమ్మరిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక పూర్తి వివరాలు తెలియాలంటే దీనిపై సుమా స్పందించక తప్పదు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు