Jai Hanuman : ‘హనుమాన్’ మూవీ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్!

Jai Hanuman : ఈ ఏడాది ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా “హనుమాన్”. తేజ సజ్జ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాటిక్ యూనివర్స్ సంక్రాంతి కానుకగా విడుదల కాగా, సంక్రాంతి రేసులో వచ్చిన బడా సినిమాలను కూడా దాటేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. విశేషమేమిటంటే ఈ ఇయర్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన అన్ని భాషల సినిమాల్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా ఇప్పటికి కొనసాగుతుంది. 300 కోట్ల భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఆ మధ్య 150 కి పైగా థియేటర్లలో యాభై రోజులను పూర్తిచేసుకోవడం విశేషం. ఇక ఇప్పటికి పలు థియేటర్లలో సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ లో క్రియేట్ చేసిన భీభత్సం మామూలు కాదు. అక్కడ టాప్ టెన్ హైయెస్ట్ గ్రాసింగ్ డబ్బింగ్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఒక కామన్ మ్యాన్ హనుమాన్ యొక్క రుధిరమణి వల్ల సూపర్ మ్యాన్ గా ఎలా మారాడన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇండియా వైడ్ గా అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించింది.

హనుమాన్ సీక్వెల్..

అయితే హనుమాన్ సినిమా రిలీజ్ అయినప్పుడే ఈ సినిమా సీక్వెల్ అనౌన్స్ మెంట్ కూడా జరిగిందన్న విషయం తెలిసిందే. మామూలుగా ఒక సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో కొంతమంది మేకర్స్ సినిమా ఎండ్ లోనే సీక్వెల్ వస్తుందని అనౌన్స్ చేస్తారు. కొన్ని సినిమాలు ప్లాప్ అయితే అక్కడితోనే ఆపేస్తారు. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. కానీ హనుమాన్ ఎవరూ ఊహించని రేంజ్ లో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటప్పుడు ఈ సినిమా సీక్వెల్ తీయాలంటే మళ్ళీ మేకర్స్ ఏ స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాలో ముందే పక్కా ప్లానింగ్ తో ఉండాలి. ఎందుకంటే సీక్వెల్ ఏమాత్రం తేడా కొట్టినా విమర్శనా బాణాలు దారుణంగా తగులుతాయి. ఇక ఈ సినిమా పార్ట్ 2 పై మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గట్టి నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది.

ఆరోజు పార్ట్ 2 ఫస్ట్ లుక్?

ఇదిలా ఉండగా జై హనుమాన్ రెండో పార్ట్ 2025 లో ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేయగా, ప్రశాంత్ వర్మ కూడా పలు ఇంటర్వ్యూల్లో రెండో పార్ట్ అప్పుడూ, ఇప్పుడూ అని హింట్ ఇస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా ఇండస్ట్రీలో హనుమాన్ ఫస్ట్ లుక్ గురించి క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. జై హనుమాన్ (Jai Hanuman) ఫస్ట్ లుక్ ఏప్రిల్ 9న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఆ రోజు తెలుగు నామ సంవత్సరం ‘ఉగాది’ పర్వదిన కానుకగా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. ఇదే గనుక నిజమైతే హనుమాన్ మూవీ ఫ్యాన్స్ కి ఇక అంతకంటే గుడ్ న్యూస్ ఉండదు. ఇక పలు స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఇప్పటికే ఈ సినిమాలో తమ హీరో నటిస్తున్నాడని ఎవరికీ వారు ఫిక్స్ అయిపోతున్నారు. అయితే సీక్వెల్ లో ఎవరు నటిస్తున్నారో ఫస్ట్ లుక్ తో డైరెక్ట్ గా ప్రకటిస్తారా? లేక ప్రశాంత్ వర్మ ఏదయినా స్పెషల్ డే రోజు సర్ప్రైజ్ ఇస్తాడా అనేది తెలియాల్సింది. మరి ఫస్ట్ లుక్ పై వస్తున్న ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఏప్రిల్ 9వరకు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు