Vijay : రియల్ పాలిటిక్స్, రీల్ పాలిటిక్స్

Vijay : సినిమా వాళ్లు రాజకీయ నాయకులు అవ్వడం కొత్త విషయం ఏమీ కాదు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది సినీ నటులు రాజకీయాల్లో తమ ప్రతిభను చూపించి స్టేట్ ను రూల్ చేశారని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం తెలుగు హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటువైపు సినిమాలు చేస్తూ అటువైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించి రాజకీయ పనులులో బిజీగా మారారు.

ఇకపోతే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇళయ దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ను ఎంతగా ఆదరిస్తారో తమిళ్ ప్రేక్షకులు విజయ్ ను అదే స్థాయిలో ఆదరిస్తారు. ప్రస్తుతం విజయ్ కూడా తమిళ్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. విజయ్ ఒక పార్టీని పెట్టి రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఒకవైపు సినిమాలు మరోవైపు పొలిటికల్ అడుగులు వేస్తున్నారు విజయ్. ప్రస్తుతం విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమాను చేస్తున్నాడు.

ఈ తరుణంలో విజయ్ అరవ 9వ సినిమా గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాను తమిళ్ డైరెక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే హెచ్ వినోద్ ఎన్నో అద్భుతమైన సినిమాలను తమిళ్లో తెరకెక్కించాడు. అలానే అజిత్ తో కూడా సినిమాలు చేశాడు హెచ్ వినోద్. హెచ్ వినోద్ కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నాడు అని ఇదివరకే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

- Advertisement -

ఇప్పుడు విజయ్ తో 69వ సినిమాను చేస్తున్న హెచ్ వినోద్ దీన్ని ఒక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించబొతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. రీసెంట్ గానే పార్టీని స్టార్ట్ చేసిన విజయ్ కి ఇది ఎంతవరకు ప్లస్ అవుతుందో తెలియాలి అంటే కొంతమేరకు వేచి చూడక తప్పదు. ఏది ఏమైనా పొలిటికల్ సినిమా విజయ్ ఈ టైంలో చేయటం అనేది మంచి ఆప్షన్ అని కొందరు అంటుంటే, పొలిటికల్ సినిమా చేసినంత మాత్రాన పొలిటిషన్ అవ్వలేరు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే విజయ్ ( Vijay ) చేసిన చాలా సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే సందేశాలను కూడా ఇస్తూ ఉంటాడు. ఇదివరకే మురగదాస్ దర్శకత్వంలో చేసిన సర్కార్ వంటి సినిమాల్లో ఓటు యొక్క వాల్యూను తెలిపారు. ఇకపోతే హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే తమిళ్ తో పాటు తెలుగులో కూడా విజయ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. స్నేహితుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విజయ్ చాలా సినిమాలు తెలుగులో మంచి రెస్పాన్స్ సాధించుకున్నాయి. తెలుగులో విజయ్ మార్కెట్ ను సరిగ్గా ఉపయోగించుకుంటే ఇక్కడ కూడా అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టవచ్చు. కానీ విజయ్ తన సినిమా ప్రమోషన్స్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు