OG: ఓజీ మూవీ నుండి షాకింగ్ పోస్టర్ రిలీజ్..ఇక పూనకాలే..!!

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్నారు.. తాను పనిచేసే సినిమాల గురించి అప్డేట్లను ఇస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తూ ఉంటారు… అయితే కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని ఫోటోలను కూడా లీక్ చేస్తూ ఉంటారు.. ఇదిలా ఉండగా తాజాగా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఒక పోస్టర్ ను సైతం రిలీజ్ చేశారు థమన్.. అయితే అది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా నుండి రిలీజ్ చేయడంతో ఇప్పుడు అభిమానులలో పెను దుమారాన్ని రేపేలా కనిపిస్తోంది..

పోస్టర్ లుక్..
అయితే ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ముంబై వీధులలో కత్తి పట్టి ప్రత్యర్థులను తెగ నరికేస్తున్నట్లుగా.. ఆయన పైన అంతా రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంది.. కత్తి ఎత్తి ఆవేశంతో విలన్లకు పవన్ కళ్యాణ్ జలక్కిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. ఇందులో పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్ ధరించి.. టక్ వేసుకొని వైట్ షర్ట్ తో మొత్తం రక్తపు మరకలతో కనిపిస్తున్నారు.. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.. ఈ లుక్ చూసి సినిమా ఎలా ఉండబోతుందో మనకు ముందుగానే హిట్ ఇచ్చినట్లు తెలియజేస్తుందని అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

ఫ్యాన్ మేడ్ పోస్టర్..
అయితే థమన్ ఇలా సడన్ గా పోస్ట్ షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఈ పోస్ట్ ఫ్యాన్ మేడ్ పోస్ట్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రానికి డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో పవన్ కళ్యాణ్ ముంబై మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నారు.. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను భారీగా ఆకట్టుకున్నాయి.. మరి ఇదే రేంజిలో సినిమా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేయడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది.

- Advertisement -

Pawan Kalyan OG Movie Update

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అప్డేట్..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా బిజీగా ఉండడం చేత సినిమా షూటింగ్లన్నీ వాయిదా వేశారు. ఇందులో నటించే నటీనటులు కూడా మొత్తం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వున్న నటీనటులు కావడం గమనార్హం. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి.. కోలీవుడ్ నటి శ్రీయా రెడ్డి తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తోంది.. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటివరకు 70% వరకు సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.. ఇక మిగిలిన 30% సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 15 రోజులు కేటాయిస్తే పూర్తవుతుందని డైరెక్టర్ సుజిత్ తెలియజేశారు.. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి తన 15 రోజులు సమయాన్ని కేటాయిస్తారా ? లేక ఎలక్షన్స్ అయిపోయే వరకు ఎదురు చూడాల్సిందేనా ? అన్న అనుమానాలు అభిమానులలో కూడా పుట్టుకొస్తున్నాయి.. మరి పూర్తి వివరాలు తెలియాలంటే చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంటుంది..

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు