Priyanka Mohan: అలాంటి సీన్స్ లో నటించిన నాని హీరోయిన్..షాక్ లో ఫ్యాన్స్..!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు నిలదొక్కుక్కోవాలి అంటే మొదట్లో ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది.. ఈ క్రమంలోనే అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమకంటూ ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాతనే సెలెక్టెడ్ గా పాత్రలు చేస్తూ పేరు దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించడానికి వెనుకాడడం లేదు… ఈ క్రమంలోనే సాంప్రదాయంగా కనిపించిన ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బోల్డ్ పాత్రలలో కూడా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు..

అయితే అప్పట్లో వారి గురించి పెద్దగా తెలియలేదు కానీ వారికి బాగా ఫేమ్ వచ్చిన తర్వాత వారు కూడా ఇలాంటి పాత్రలో నటించారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అలాంటి వారిలో నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఒకరిని చెప్పవచ్చు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇంజనీరింగ్ పూర్తి చేసి మోడలింగ్ ద్వారా తన కెరీర్ను మొదలుపెట్టింది.. ఆ తర్వాత కన్నడలో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక .. వెంటనే తెలుగు చిత్రంలో అవకాశం లభించింది. అలా నానికి జంటగా గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోయినా.. ప్రియాంకకి మాత్రం తన నటనతో మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన డాక్టర్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత అదే హీరోతో జతకట్టి డాన్ చిత్రంలో నటించగా.. అది సూపర్ హిట్ అయింది.. ఆ తర్వాత సూర్య సరసన ఎదుర్కుమ్ తుణిందవన్‌ (ET) తో పాటు ధనుష్తో కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ప్రస్తుతం మరొకసారి నానితో కలిసి సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తోంది.. ఇదిలా ఉండగా ప్రియాంక కూడా బోల్డ్ సన్నివేశాలలో నటించింది. అసలు విషయంలోకి వెళితే.. ప్రియాంక మొదట తమిళంలో డాక్టర్ అనే సినిమాలో నటించిందనే టాక్ ఉంది కానీ అంతకంటే ముందు ఆమె టిక్ టాక్ అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగా అందులో ప్రియాంక బెడ్ రూమ్ సన్నివేశాలు చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

- Advertisement -

మరోవైపు బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉంటుందనే పేరైతే ప్రియాంకకు వచ్చింది కానీ ఇప్పుడు ఈమెని ఇలా చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. సాధారణంగా ఎవరైనా అవకాశాల కోసం మొదట్లో ఇలాంటి పాత్రలు చేయడం సహజమే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఓటేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు