Priyanka Arul Mohan : ప్రియాంక మోహన్ జోరు మాములుగా లేదు..

Priyanka Arul Mohan

నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్ గురించి అందరికి తెలిసిందే. తెలుగులో మొదటి సినిమాతోనే హోమ్లీ బ్యూటీ గా అందరీ మనసును దోసేసిన ఈ భామ.. సినిమాలు మాత్రం సంవత్సరానికోకటి అన్నట్టు ఒక్కో సినిమా చేస్తూ వస్తుంది. గతేడాది శివ కార్తికేయన్ నటించిన డాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ప్రియాంక మోహన్.

ఇక ఈ సినిమా తరువాత ప్రియాంక మోహన్ నుంచి ఇప్పటి వరకు మరేతర సినిమా రాలేదు. దాంతో ఈ బ్యూటీ కూడా ఫెడ్ అవుట్ అయినట్టే అని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే ఈ అమ్మడు వ్యవహారం మాత్రం అలా లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రియాంక మోహన్ ఈ ఏడాది చక చక రెండు సినిమాల షూటింగ్ లను కంప్లిట్ చేసింది.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దానయ్య డివివి నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న ఓజి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ప్రియాంక మోహన్. ఇక సినిమాలో తన పార్ట్ షూటింగ్ ఇంకో రెండు షెడ్యూల్ లతో పూర్తి కానుందని టాక్. ఇక ఈ సినిమాతో పాటు ప్రియాంక మోహన్ తమిళ్ లో ధనుష్ హీరోగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -

పాన్ ఇండియా సినిమాగా ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ కెప్టెన్ మిల్లర్ సినిమా డిసెంబర్ 15 న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ కెప్టెన్ మిల్లర్ సినిమాలో ప్రియాంక మోహన్ తన పార్ట్ షూటింగ్ కంప్లిట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. దీనిబట్టి చూస్తే ప్రియాంక మోహన్ ఈ ఏడాది ఒక పాన్ ఇండియా సినిమాతో మరియు వచ్చే ఏడాది ఓజి లాంటి భారీ అంచనాలున్న సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాదన్న మాట.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు