Kushi : సినిమా చూసి థియేటర్ నుంచి కోపంతో బయటకు వచ్చిన నాగచైతన్య ?

Kushi

లైగర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తానని రచ్చ చేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కానీ ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్‌కు అటు పూరి జగన్నాథ్, ఇటు రౌడీ.. ఇద్దరు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే.. అర్జెంట్‌గా తమకు ఒక హిట్ కావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ‘ఖుషీ’ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది.

శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ గ్రాండ్‌గా నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఖుషి ట్రైలర్.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.

హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ట్యూన్స్ మ్యూజిక్ లవర్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో.. ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాన్సర్ట్‌ను ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిర్వహించి.. ఓ ఊపు తెప్పించారు. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో నాగచైతన్య ఓ సినిమాకు వెళ్లాడట.

- Advertisement -

ఆ సినిమా ఇంటర్వెల్ సమయంలో ఖుషి సినిమాకు సంబంధించిన ట్రైలర్ అలాగే… సాంగ్స్ వచ్చాయట. ఇక ఖుషి సినిమా ట్రైలర్ రావడంతో చిర్రెత్తిపోయిన నాగచైతన్య… వెంటనే థియేటర్ బయటకు వచ్చి ఇంటికి వెళ్లిపోయాడట. విజయ్ దేవరకొండ మరియు సమంత చేసిన రొమాన్స్ చూసి తట్టుకోలేకపోయాడట నాగచైతన్య. కాగా ఖుషి సినిమా సెప్టెంబర్‌ 1వ తేదీన రిలీజ్‌ కానుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు