Mannara chopra : ముద్దు పెడితే మీకేంటి నొప్పి- నా హీరోయిన్ నా ఇష్టం – డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Mannara chopra

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా తిరగబడరా నా సామి టీజర్ లాంచ్ ఈవెంట్ ఇటీవలనే హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మాల్వి మల్హోత్రా, మన్నార చోప్రా హీరోయిన్స్ గా నటించారు. కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మల్కాపురం శివకుమార్ నిర్మించారు.

కాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ రవికుమార్ చౌదరి, నటి మన్నార చోప్రా ను బహిరంగంగా ముద్దుపెట్టిన విషయం తెలిసిందే . సరదాగా ఫోటోలకు పోజులు ఇవ్వమంటూ ఆయనను మన్నార చోప్రా పిలవగా ఆమెతో కలిసి ఫోటోలకు పోజు ఇస్తూ వెంటనే ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టేసాడు. దాంతో ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోని హీరోయిన్ మన్నార చోప్రా డైరెక్టర్ రవికుమార్ చౌదరి చేసిన పనికి నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే రవికుమార్ చౌదరి మన్నార చోప్రా కు ముద్దు పెట్టిన వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. డైరెక్టర్ అయ్యి ఉండి.. మరీ నీచానికి దిగజారాలా ఆది కూడా పబ్లిక్ గానా అంటూ సోషల్ మీడియా వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

దాంతో ఈ విషయంపై డైరెక్టర్ రవి కుమార్ చౌదరి లేటెస్ట్ గా స్పందించారు. ముద్దు పెట్టుకున్న మన్నార చోప్రాకు లేని నొప్పి మీకేంటని మీడియాను ఎదురు ప్రశ్నించారు. మన్నార చోప్రా నా కూతురు లాంటింది అందుకే ముద్దు పెట్టాను. అయినా మన్నార చోప్రాకు ముద్దు పెట్టడం పై నా ఫ్యామిలీనే నన్ను ప్రశ్నించలేదు. మీరెవరు ప్రశ్నించడానికి అని రియాక్ట్ అయ్యారు. పబ్లిక్ గా హీరొయిన్ కు ముద్దు పెట్టడమే కాకుండా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తూ రవికుమార్ చౌదరి తన అవివేవేకత్వాన్ని చాటుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు కూడా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు పబ్లిక్ గా ముద్దు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు