Raj tarun new movie : ముసలోడే కానీ మహానుభావుడు.. హీరోయిన్ కి పబ్లిక్ గా ముద్దుపెట్టిన డైరెక్టర్..!

Raj tarun new movie

ప్రస్తుతం మనం సోషల్ మీడియా జమానాలో బ్రతుకుతున్నాం. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని చేయాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగానే ఉండాలి. లేదంటే ట్రోలర్స్ బారిన పడ్డట్టే. ప్రస్తుతం సీనియర్ దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ఈ దర్శకుడు బాలకృష్ణతో వీరభద్ర, గోపీచంద్ తో యజ్ఞం, సాయిధరమ్ తేజ్ తో పిల్ల నువ్వు లేని జీవితం వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఇప్పుడు రాజ్ తరుణ్ తో “తిరగబడరా సామి” అనే సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రానికి మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా నటించింది. మకరంద్ దేశ్ పాండే విలన్ పాత్రలో నటించారు. అలాగే మన్నారా చోప్రా ఓ కీలక పాత్రలో నటించింది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ మన్నార చోప్రాకు మీడియా ముందే ముద్దు పెట్టారు దర్శకుడు రవికుమార్ చౌదరి.

దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షాకింగ్ ఘటనకు ఎలా రియాక్ట్ అవాలో తెలియక మన్నారా చోప్రా నవ్వుతూ కవర్ చేసినట్లుగా అనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ముసలోడే కానీ మహానుభావుడు అని కొంతమంది కామెంట్ చేయగా.. ఇవేం పనులు అని కొంతమంది మండిపడుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు