Nupur Sanon: టాలీవుడ్ లో పాగా వేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Nupur Sanon

ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ గురించి అందరికి తెలిసిందే..సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాదించకపోవటంతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవ్వలేకపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీకి బాగా కలిసి వచ్చింది.

దాంతో బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ..బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు కృతి సనన్ గురించి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే.. కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ కూడా అక్క బాటలోనే వెళ్తూ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమవబోతుంది. అంతేకాదు హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ అవకుండానే వరుస పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంటుంది.

బాలీవుడ్ లో సింగర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన నుపుర్ సనన్, ప్రస్తుతం రవితేజ మొదటి పాన్ ఇండియా సినిమా అయిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నుపుర్ సనన్ సారా అనే పాత్రలో కనిపించబోతున్నట్టు ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది ఆమె సహోదరి కృతి సనన్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా అవకుండానే మరో పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది.

- Advertisement -

మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న కన్నప్ప అనే సినిమాలోనూ నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు టాలీవుడ్ లో పలు అగ్ర హీరోల సినిమాలలో నటించేందుకు కూడా ఈమెను అప్రోచ్ అవుతున్నారట మేకర్స్. దీనిబట్టి చూస్తే త్వరలోనే టాలీవుడ్ కు నుపుర్ సనన్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు