RaviTeja’s Tiger Nageswara Rao: అన్ ఫార్చునేట్లి క్రిమినల్ అయ్యాడు..!

RaviTeja’s Tiger Nageswara Rao

స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.గ్లిమ్ప్స్ తో సినిమాపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచే విధంగా ఉంది. రవితేజ గురించి మురళీ శర్మ ఇచ్చిన నేరేషన్ రవితేజ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసింది. జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. రవితేజకి రీసెంట్ గా రావణాసుర లాంటి డిజాస్టర్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది.

ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాయిదా పడటం వల్ల రిలీజ్ డిలే అయ్యింది. అక్టోబర్ 20న రిలీజ్ అవ్వటం కూడా అనుమానమే అన్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సినిమా యూనిట్ టీజర్ ని రిలీజ్ చేయటంతో ఆ అనుమానాలకు చెక్ చెప్పినట్లయింది. 70ల కాలం నాటి బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో రవితేజ సరసన గాయత్రీ భరద్వాజ్, నుపుర్ సనన్ హీరోయిన్లుగా నటించారు.

రావణాసుర లాంటి డిజాస్టర్ వచ్చిన తర్వాత ఏ మాత్రం గ్యాప్  తీసుకోకుండా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాటు ఈగల్ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు. ఇటీవలే రిలీజైన ఈగల్ గ్లిమ్ప్స్ కూడా ఆకట్టుకోవడంతో రవితేజకి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి. మరి, టీజర్ తో అంచనాలు పెంచిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజకి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు