Actress Rakshitha: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగ్ బ్యూటీ..!

Actress Rakshitha..ఒక సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సైజ్ జీరో ఫిగర్ మెయింటైన్ చేస్తూ తమ అంద చెందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటారు.. కొంటె చూపులతో హాట్ అందాలతో యువతకు గాళం వేసే ఈ ముద్దుగుమ్మలు సడన్గా పెళ్లిళ్లు చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గుర్తుపట్టకుండా మారిపోతూ ఉంటారు.. అధిక బరువు తోపాటు వారి గ్లామర్ లో కూడా మార్పులు రావడం చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కొంతమంది పెళ్లయి , పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే ఫిగర్ ను మైంటైన్ చేస్తే.. మరి కొంత మంది అలా మెయింటైన్ చేయక ఇబ్బంది పడుతూ ఉంటారు.. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ రక్షిత కూడా ఒకరు..

తొలి సినిమాతోనే సక్సెస్..

Actress Rakshitha: Nag beauty that has changed beyond recognition..!
Actress Rakshitha: Nag beauty that has changed beyond recognition..!

ఈమెను చూస్తే అప్పట్లో యువత పిచ్చెక్కిపోయే వాళ్ళు.. రవితేజ నటించిన ఇడియట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో తన అందచందాలతోనే కాదు తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా కంటే ముందు కన్నడ లో అప్పు అనే చిత్రం చేయగా.. ఈ సినిమాను రీమేక్ చేసి తెలుగులో ఇడియట్ గా చేశారు.. ఇక రెండు చిత్రాలకి దర్శకుడు పూరీ జగన్నాథ్ కాగా రెండు సినిమాలలో ఈమెని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ఇక కన్నడలో అప్పు సినిమాలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించగా.. తెలుగులో రవితేజ నటించిన రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఇక ఈమె నటించిన మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో.. తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు వెలువడ్డాయి.. అందులో భాగంగానే నిజం, శివమణి , ఆంధ్రావాలా, అందరివాడు వంటి చిత్రాలలో నటించింది.. కానీ ఈ సినిమాలన్నీ థియేటర్ వద్ద తేలిపోయాయి.. దాంతో ఈమె పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.. ఇక చివరిగా 2005 లో జగపతిబాబు తో ఒక సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇక తర్వాత మళ్లీ సినీ తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు.

మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న రక్షిత..

ఇక కన్నడ లోనే సినిమాలు చేస్తూ అక్కడే కన్నడ డైరెక్టర్ ను వివాహం చేసుకుంది.. 2007లో పెళ్లి చేసుకోగా అప్పటినుండి సినిమాలు మానేసింది రక్షిత.. ఇక హీరోయిన్గా నటించడం మానేసింది కానీ నిర్మాతగా మాత్రం ఇండస్ట్రీలో చలామణి అయ్యింది. డీకే, ఏక్ లవ్ యా , జోగయ్య పంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది.. అంతేకాదు పలు కన్నడ టీవీ షోలకి హోస్ట్ గా , జడ్జిగా కూడా చేసింది..

- Advertisement -

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రక్షిత..

ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో ఈమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. చాలా బొద్దుగా మారిపోయి.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది .. అయితే ఈమె ఇలా బరువు పెరగడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు.. ఈ విషయాలు తెలిసి ఈమెకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే రక్షిత ఇలా బొద్దుగా కనిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఈమె కూడా జిమ్ కి వెళ్లి.. సైజ్ జీరో ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ పూర్వవైభవాన్ని దక్కించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు