Jawan Movie: షారుక్ కోసం తన పాలసీని బ్రేక్ చేస్తున్న నయన్

Jawan Movie

ఫస్ట్ నుంచి నమ్ముకున్న పాలసీని బ్రేక్ చేసి సక్సెస్ అయినవాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రజెంట్ డేస్‌లో చెప్పుకోవాల్సి వస్తే మిల్క్ బ్యూటీ తమన్నా. నో కిస్సింగ్ పాలసీని పక్కన బెట్టిన తమన్నా ప్రస్తుతం తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చింది. ఇప్పుడు నయనతార కూడా తమన్నా రూట్‌లో వెళ్లడానికి రెడీ అవుతుంది.

నయన్ లెటేస్ట్ సినిమా జవాన్ కోసం తాను ఇప్పటి వరకు పెట్టుకున్న నో ప్రమోషన్స్ పాలసీని బ్రేక్ చేయబోతుంది. ప్రభుదేవతో ప్రమాయణం సాగించే వరకు నయనతార తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేది. కానీ, ప్రభుదేవతో లవ్ ట్రాక్ టైంలో పర్సనల్‌గా నయన్ కొన్ని ప్రబ్లామ్స్ ని ఫేస్ చేసింది. దీంతో అప్పుడు నో ప్రమోషన్స్ పాలసీని పెట్టుకుంది. అప్పటి నుంచి ఎంత పెద్ద మూవీ చేసినా ప్రమోషన్స్ కు దూరంగానే ఉండేది. అందుకు ప్రొడ్యూసర్స్‌తో ముందుగానే అగ్రిమెంట్ కూడా చేసుకునేది.

అయితే ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా కోసం తన పాలసీని బ్రేక్ చేసి జవాన్ ప్రమోషన్స్ లో పాల్గొనబోతుందని తెలుస్తుంది. అందుకోసం నయనతారను ప్రొడ్యూసర్స్ ఒప్పించారట. అయితే, జవాన్ ప్రమోషన్స్ లో పాల్గొనడం ప్రొడ్యూసర్స్ కి మాత్రమే కాదు, బీ టౌన్‌లో ఈ లేడీ సూపర్ స్టార్ మార్కెట్ పెంచుకోవడానికి కూడా యూజ్ అవుతుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు