RaviTeja: బ్లాక్ బస్టర్ ఇచ్చిన రైటర్ తో రవితేజ మరో సినిమా..!

టాలీవుడ్లో కొత్త దర్శకులను టెక్నీషియన్స్ ని ఎంకరేజ్ చేసే హీరోలలో మాస్ మహారాజ రవితేజ ఒకడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, గోపీచంద్  మలినేని, బాబీ వంటి చాలా మందికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసాడు. ఉయ్యాలా జంపాల సినిమాతో రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రసన్న కుమార్ బెజవాడ ధమాకా సినిమా ద్వారా ఛాన్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ మరోసారి ప్రసన్నకి ఛాన్స్ ఇచ్చాడని సమాచారం అందుతోంది. ప్రసన్న వినిపించిన కథ నచ్చటంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ వాటి తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు.

గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్ లో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న రవితేజ ఆ తర్వాత ప్రసన్న కుమార్ స్టోరీ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే, ప్రసన్న నాగార్జునతో కమిట్ అయిన రీమేక్ సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ధమాకా సినిమాతో ప్రసన్నని స్టార్ రైటర్ అని చేసిన రవితేజ మరో ఛాన్స్ ఇవ్వటం ప్రసన్నకి మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పాలి.

రావణాసుర లాంటి డిజాస్టర్ అందుకున్న తర్వాత వాటి ప్రభావం ఏమీ లేకుండా రవితేజ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ వెళ్తున్న క్రమంలో విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలకు సంబందించిన గ్లింప్స్ వీడియోలు సినిమాపై ఆసక్తి పెంచుతూ రవితేజకి మరో బ్లాక్ బస్టర్ ఖాయం అన్న సంకేతాలు ఇస్తున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు