Nani’s Next Movie: ‘అంటే..’ ఈసారైనా హిట్ కొడతారా..?

Nani’s Next Movie

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ సినిమాకంటూ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాలో నాని, నజ్రియా యాక్టింగ్ కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అంటే సుందరానికి సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో మరో సినిమా రానుందని టాక్ వినిపిస్తోంది.

డీవీవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ అవ్వనుందని సమాచారం అందుతోంది. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని ప్రస్తుతం శౌర్యువ్ డైరెక్షన్లో హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇటీవలే రిలీజైన హాయ్ నాన్న గ్లిమ్ప్స్ సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. పాన్ ఐడియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హిట్ అవ్వటం నానికి కీలకంగా మారింది. దసరా సినిమా ద్వారా తెలుగు స్టేట్స్ లో హిట్ అందుకున్నప్పటికీ నార్త్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. డెబ్యూ డైరెక్టర్ తో రిస్క్ చేసినందుకు నానికి ప్రశంసలు అందినప్పటికీ పాన్ ఇండియా హిట్ దక్కలేదన్న అసంతృప్తి మిగిలింది.

- Advertisement -

వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్లో రూపొందనున్న సినిమా ఎలాంటి కథతో ఉండనుంది వంటి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఎంటర్టైనర్ సినిమాలకు వివేక్ ఆత్రేయ కేరాఫ్ కావటంతో నాని నెక్స్ట్ సినిమా కూడా ఎంటర్టైనర్ అయ్యుంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. మరి, ఆసక్తి పెంచుతున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు