NaturalStar Nani: మరోసారి టంగ్ స్లిప్ అయిన నాని – ఫ్యాన్స్ నాన్ స్టాప్ బ్యాటింగ్..!

న్యాచురల్ స్టార్ నానిని మరోసారి నెటిజన్స్ టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా ఒకటి రెండు సార్లు ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికల మీద నాని చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. తాజాగా పాన్ ఇండియా హీరో అన్న అంశం మీద నాని చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో రచ్చకి దారి తీశాయి. వివరాల్లోకి వెళితే, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోతా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు నాని, ఈ ఈవెంట్ లో స్టేజ్ మీద మాట్లాడుతూ తనకి తెలిసిన పాన్ ఇండియా స్టార్ దుల్కర్ మాత్రమే అని సెన్సేషనల్ కామెంట్ చేశాడు నాని. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియాలో నానిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ వరుస పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న తరుణంలో నాని చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు RRR ఆస్కార్ రేంజ్ ఎదిగి గ్లోబల్ స్టార్ గా పిలువబడుతున్న సమయంలో నాని ఇలాంటి కామెంట్స్ చేయటం వివాదాస్పదం అయ్యింది.

ఇదిలా ఉండగా, దసరాతో పాన్ ఇండియా హిట్ కోసం ట్రై చేసిన నానికి నార్త్ ల ఆదరణ దక్కలేదు కాబట్టి జెలసీతో ఈ కామెంట్స్ చేశాడని అంటున్నారు. తాను ఎలాగో పాన్ ఇండియా స్టార్ కాలేడని ఫిక్స్ అయ్యి తెలుగు హీరోలను తక్కువ చేసేలా కామెంట్స్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి నాని ఇంటెన్షన్ టాలీవుడ్ స్టార్ హీరోలను తక్కువ చేయటం అయితే కాదు, దుల్కర్ సల్మాన్ ముందు నుండి కన్నడ, తమిళ్, తెలుగు మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి నాని ఈ కామెంట్స్ చేసి ఉంటాడన్న అభిప్రాయం వెల్లడవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు