MissShettyMrPolishetty: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Miss Shetty Mr. Polishetty’s release date is locked

యంగ్ టాలెంటెడ్ నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది మూవీ టీం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు పి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా అప్పుడెప్పుడో షూటింగ్ కంప్లిట్ చేసుకుంది. ఇక సినిమా రిలీజ్ అవడమే లెట్ అనుకునే సమయంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుంచి ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ సినిమా ఆదిపురుష్ రిలీజ్ ఉండటం వల్ల మొదటి సారి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా వాయిదా పడింది.

ఆ తరువాత ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్, ఇది ఫిక్స్ అంటూ యూవీ క్రియేషన్స్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమారిలీజ్ డేట్ ను లాక్ చేసింది. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా, మెగా స్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కు రెడీ ఉండటంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాని మరోసారి వాయిదా పడక తప్పలేదు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను రిలీజ్ కు ఎప్పుడు ఏదో పెద్ద సినిమా అడ్డు వస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇక లేటెస్ట్ గా ఈ సినిమాని ఈ సెప్టెంబర్ 7న కృష్ణాష్టమి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు యూవీ క్రియేషన్స్ కాసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 7 తేదీన కూడా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. మరీ ఈసారి అయిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను అనుకున్న డేట్ ప్రకారం రిలీజ్ చేస్తారాలేక వాయిదా వేస్తారా అనేది ప్రశార్ధకం. ఏది ఏమైనా ఇప్పటికైతే మాత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 7 అని ఫిక్స్ అయిపోండి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు