Megastar’s Next Project: చిరు, కళ్యాణ్ కృష్ణ సినిమా ఇక లేనట్లేనా..?

Megastar’s Next Project

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని గత కొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. భోళాశంకర్ సినిమా రిలీజై చిరంజీవికి బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఈ నెలలోనే చిరు, కళ్యాణ్ కృష్ణల సినిమా స్టార్ట్ అవుతుందని టాక్ మొదలైంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్తుందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. భోళాశంకర్ రిజల్ట్ కారణంగా చిరంజీవి స్టోరీ సెలెక్షన్ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయద్దని, ఇక రీమేక్స్ ఆపేయాలని సోషల్ మీడియా వేదికగా చాలా మంది మెగాఫ్యాన్స్ చిరంజీవికి సూచనలిస్తున్నారు.

ఇదిలా ఉండగా చాలాకాలంగా చిరుని చాలాకాలంగా మోకాలి నొప్పి వేధిస్తున్న నేపథ్యంలో మోకాలి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఈ మేరకు ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ వెళ్లనున్నాడని, సర్జరీ తర్వాత రెండు,మూడు నెలల రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీన్ని బట్టి చుస్తే మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయాలంటే 3నెలల తర్వాతనే అని క్లారిటీ వస్తోంది.

ప్రస్తుతం చిరు, కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ లతో సినిమాలు కమిట్ అయ్యాడని వార్తలొస్తున్నప్పటికీ అఫీషియల్ గా ఏ ప్రాజెక్ట్ గురించి అనౌన్సమెంట్ అయితే రాలేదు.ఇప్పటికే డిజాస్టర్ ట్రాక్ ఉన్న మెహర్ రమేష్ తో సినిమా చేసి డిజాస్టర్ అందుకొని తీవ్ర స్థాయిలో విమర్శలు అందుకుంటున్న నేపథ్యంలో మరోసారి సోగ్గాడే మినహా చెప్పుకోదగ్గ హిట్ లేని కళ్యాణ్ కృష్ణ లాంటి డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తాడా అన్న అనుమానం కలుగుతోంది. మరి, భోళాశంకర్ ఇచ్చిన షాక్ తో అయినా చిరు ఆలోచనా తీరులో మార్పు వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు