The Team Of #Virupaksha is back : విరూపాక్ష డైరెక్టర్ కొత్త సినిమా షురూ

The Team Of #Virupaksha is back

ఈ ఏడాది వచ్చిన మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన విరూపాక్ష సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై ,దాదాపు 100 కోట్ల వరకు రాబట్టి థియేటర్స్ లో కలెక్షన్స్ సునామిని సృష్టించింది. ఎస్వి సిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించాడు.

విరూపాక్ష సినిమా రిలీజై దాదాపు 5 నెలలు కావోస్తుండగా డైరెక్టర్ కార్తీక్ దండు అంతలోనే తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ను ప్రకటించాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కార్తీక్ దండు. తన రెండవ సినిమా కూడా విరూపాక్ష తరహాలోనే మరో థ్రిల్లర్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మిథికల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ నిర్మిస్తున్నారు.

ఇటీవల కాలంలో టాలీవుడ్ యువ దర్శకులు మొదటి సినిమా సూపర్ హిట్ కొట్టి, రెండవ తీయడానికి మాత్రం చాలా టైం తీసుకుంటున్న తరుణంలో కార్తీక్ దండు మాత్రం కేవలం 5 నెలల వ్యవధిలోనే నెక్స్ట్ సినిమాకి సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే గతంలో కార్తీక్ దండు విరూపాక్ష కు సీక్వెల్ పార్ట్ 2 తీస్తానని చెప్పగా, అది పక్కన పెట్టి ప్రస్తుతం ఆయన కొత్త ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయడంతో విరూపాక్ష 2 సినిమాకు మరికొంత సమయం పట్టేలా ఉందని అర్థమవుతోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు