Sai Rajesh’s Baby: మరో బేబీ రెడీ అవుతుందా..?

Sai Rajesh’s Baby

కలర్ ఫోటో సినిమా ద్వారా నేషనల్ అవార్డు అందుకున్న సాయిరాజేష్ డైరెక్షన్లో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన బేబీ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 5కోట్ల బడ్జెట్ తో చిన్న సినిమాగా రూపొందిన ఈ సినిమా సుమారు 50కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. యూత్ కి కనెక్ట్ అయ్యే కడాంశంతో వచ్చిన ఈ సినిమాకు యంగ్ ఆడియెన్స్ బ్రహ్మరధం పట్టారు. బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో వైష్ణవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో వైష్ణవికి వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా సాయిరాజేష్ బేబీ ఫార్మాట్ లో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. ఈ సినిమా ద్వారా మరో యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక హీరోయిన్ గా పరిచయం కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే, సాయిరాజేష్ ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడని, మరో యువ దర్శకుడికి ఈ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా మొదలు పెడతాడని అంటున్నారు.

కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు అందుకొని, బేబీ లాంటి చిన్న సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత ఏ డైరెక్టర్ అయినా స్టార్ హీరోలతో సినిమా చేసేందుకు ప్రిఫరెన్స్ ఇవ్వడం సహజం. అలాంటిది సాయిరాజేష్ మరోసారి బేబీ ఫార్మాట్ లో సినిమా చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి, బేబీ ఫార్మాట్ లో రానున్న మరో సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు