Anil Sunkara STRONG reply : భోళా శంకర్ ఆ వార్తల్లో నిజం లేదు- ప్రొడ్యూసర్ వాట్స్ యాప్ చాట్ వైరల్

Anil Sunkara STRONG reply

మెగా స్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్ కు సంబంధించి చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో ప్రొడ్యూసర్ ను చిరు ఇబ్బంది పెడుతున్నాడని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి బాలన్స్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి గాను ప్రొడ్యూసర్ అనిల్ సుంకర తన ఫామ్ హౌస్ ను కూడా అమ్మేసినట్టు నెట్ పలు వార్తలు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ విషయాలపై మూవీ యూనిట్ఇప్పటి వరకు స్పందించక పోవడంతో ఈ రూమర్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కాగా లేటెస్ట్ గా ఈ రూమర్స్ అన్నింటిపై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చాడు

వివరాల్లోకి వెళ్తే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్.తమన్నా, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో హిట్టైన వేదాళం రీమేక్ గా రూపొందించబడింది. ఆగస్ట్ 11న రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల దగ్గర నుండి నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ తో భోళా శంకర్ సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.

అయితే భోళా శంకర్ సినిమాకు థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ వస్తుడటంతో మెగా స్టార్ చిరంజీవి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ను తనకు రావాల్సిన బ్యాలన్స్ రెమ్యునరేష్ తిరిగి ఇవ్వాలంటూ ఇబ్బంది పెడుతున్నాడని సోషల్ మీడియాలో పలు కథనాలు వెలుబడ్డాయి. దాంతో మెగా స్టార్ చిరంజీవి పై తీవ్రంగా నెగిటివిటీ వచ్చింది. మెగా ఫ్యాన్స్ కు కూడా ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తేలిక సైలెంట్ అయిపోయారు. దాంతో ఈ వార్త నానాటికి ఇంకా ఎక్కువగా పాపులర్ అవడంతో ఒక మెగా అభిమాని ఈ న్యూస్ ఆర్టికల్ ను డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు వాట్స్ యాప్ లో పంపించి ఇది నిజమేనా అని అడిగాడు. దానికి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదని, చిరంజీవి గారు చాలా మంచి మనిషి, రూమర్స్ ను పట్టించుకోకండి. చిరంజీవితో త్వరలోనే తాను మరో సినిమా తీసి అందరి నోళ్లు మూయిస్తానని సమాధానం ఇచ్చాడు. ఇక ఈ చాట్ ను ఆ మెగా అభిమాని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం ఈ వాట్స్ యాప్ చాట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు