Bhola shankar: ఈ నిర్మాతకి టైమ్ అస్సలు బాలేదుగా..!

Bholashankar’s producer time is not good

మెగాస్టార్ చిరంజీవి – తమన్నా హీరో హీరోయిన్లుగా.. కీర్తి సురేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన భోళాశంకర్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. అయితే ఈ సినిమా ఆశించినంత సక్సెస్ కాలేక పోయింది. తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు 28 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండగా.. వీకెండ్ లో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఆశించినంత స్థాయిలో లేదని సమాచారం. చాలా ఏరియాలలో నిర్మాత అనిల్ సుంకర సొంతంగా ఈ సినిమాలు రిలీజ్ చేశారట.

అయితే అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఫెయిల్యూర్ కావడంతో అనిల్ సుంకరకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ లాస్ ని బోళాశంకర్ తో పూడ్చుకోవాలని అనుకున్నాడు నిర్మాత. కానీ ఆయన టైమ్ అస్సలు బాలేదని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. బోళాశంకర్ – ఏజెంట్ రెండు చిత్రాలకు హీరోలు, డైరెక్టర్లు వేరు.. కానీ నిర్మాత మాత్రం ఒక్కరే. ఏజెంట్ బడ్జెట్ 70 కోట్లు కాగా.. ఆ చిత్రం కేవలం 13 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఇప్పుడు భోళాశంకర్ సినిమాకి 80 కోట్లు ఖర్చు పెట్టారు.

అయితే ఈ చిత్రం మొదటి రోజు 15 కోట్లు కలెక్షన్ చేసింది. ఈ చిత్రం ఇంకా 65 కోట్లు రాబట్టాల్సి ఉంది. కానీ పరిస్థితి చూస్తుంటే మరో 50 కోట్లు రావడం కూడా కష్టమే. అలాగే భోళాశంకర్ మూవీ శాటిలైట్ హక్కులు సైతం అమ్ముడు కాలేదని తెలుస్తోంది. ఏజెంట్ సినిమాతో షాక్ తిన్న నిర్మాత అనిల్ సుంకర కు ఈ సినిమా.. ఆ సినిమాను మించి నష్టాలను మిగుల్చుతోంది. దీంతో ఆయన టైం అసలు బాలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తర్వాత సినిమాలు అయినా ఆయనకు లాభాలు అందిస్తాయో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు