Vaishnavi Chaitanya’s Baby: బేబీ టీం మాస్టర్ ప్లాన్ – 100కోట్లు టార్గెట్..!

Vaishnavi Chaitanya’s Baby

సాయిరాజేష్ డైరెక్షన్లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన బేబీ సినిమా ఇటీవలే విడుదలై  సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా మూడు వారాలు దాటినా ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే 80కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు సినిమా యూనిట్ 100కోట్ల మైల్ స్టోన్ టార్గెట్ గా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ సినిమాలో డిలీటెడ్ సీన్స్ ని, ఒక సాంగ్ యాడ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఒక పక్క పవర్ స్టార్ బ్రో సినిమా రిలీజ్ అయినప్పటికీ బేబీ హవా తగ్గలేదు. రిలీజయ్యి 25 డేస్ అవుతున్న ఈ సినిమా విషయంలో యూనిట్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయితే గనక 100కోట్ల మైల్ స్టోన్ రీచ్ అవ్వటం పెద్ద కష్టమేమి కాదని చెప్పచ్చు.

ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్ గా నిలిచినా బేబీ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీల ప్రశంసలు అందటం ఒకరకంగా బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. థియేటర్లో ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయటమే కాకుండా ఓటీటీలో 4గంటల డ్యూరేషన్ తో త్వరలోనే రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి చిన్న సినిమాగా రిలీజైన బేబీ సినిమా ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అవ్వటంతో కంటెంట్ కి ఇంపార్టెన్స్ మరోసారి ప్రూవ్ అయ్యింది.

- Advertisement -

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన వైష్ణవి చైతన్యకి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా యాడ్ చేయబోయే సీన్లు మదర్ సెంటిమెంట్ కి సంబందించి ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సాయిరాజేష్ ఆ సీన్స్ గురించి వివరించగా ఆ స్సీన్స్ సినిమాలో ఉండుంటే బాగుండేదని ఆడియెన్స్ అభిప్రాయం వ్యక్తమయింది. 25డేస్ సెలెబ్రేషన్స్ లో భాగంగా సంధ్య థియేటర్లో కొత్తగా సీన్స్ యాడ్ చేసిన వర్షన్ ని రిలీజ్ చేయనున్నారు. మరి, ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యి బేబీ 100కోట్ల మైల్ స్టోన్ రీచ్ అవుతుందా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు