Vaishnavi Chaitanya’s Baby: బేబీ హీరోయిన్ ని లాక్ చేసిన ప్రొడ్యూసర్..!

Vaishnavi Chaitanya’s Baby

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన బేబీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా పరిచయం అయ్యింది. యూట్యూబర్ గా ఫేమస్ అయిన వైష్ణవి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాలో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో వైష్ణవి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

సినిమాలో వైష్ణవి క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ ఉండటం వల్ల థియేటర్లలో ఆడియెన్స్ ఆ క్యారెక్టర్ ని బూతులు తిట్టే రేంజ్ లో ఇన్వాల్వ్ అయ్యేలా ఇంపాక్ట్ చేసింది వైష్ణవి నటన. టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లు కరువైన ఈ రోజుల్లో ఒక తెలుగు అమ్మాయి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకోవటం పట్ల ఇండస్ట్రీ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

బేబీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటంతో వైష్ణవికి వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటిని యాక్సెప్ట్ చేయట్లేదట వైష్ణవి. ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ తో చేసుకున్న అగ్రిమెంట్ ఇందుకు కారణం అని తెలుస్తోంది. బేబీ సినిమా సైన్ చేసే సమయంలో నిర్మాత వైష్ణవితో ఇంకో మూడు సినిమాలు వరుసగా చేసేట్టుగా అగ్రిమెంట్ చేయించుకున్నాడట. దీంతో వైష్ణవికి వస్తున్న క్రేజీ ఆఫర్లు ఏ ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయలేని సిచువేషన్ ఏర్పడిందట.

- Advertisement -

వైష్ణవితోనే కాకుండా దర్శకుడు సాయి రాజేష్ తో కూడా మూడు సినిమాలు కమిట్ అయ్యాడు ఎస్ కే ఎన్. ఈ నేపథ్యంలో సాయి రాజేష్ తో చేయబోయే నెక్స్ట్ మూడు సినిమాలకు కూడా హీరోయిన్ గా వైష్ణవి ఉండే అవకాశం ఉంది. మరి, ఎస్ కే ఎన్ తదుపరి సినిమాలు వరుసగా చేస్తాడా లేక కొంత గ్యాప్ ఇచ్చి వైష్ణవికి వేరే సినిమాలు చేసుకునే ఛాన్స్ ఇస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత వస్తున్న క్రేజీ ఆఫర్స్ ని క్యాష్ చేసుకోలేని విధంగా లాక్ చేశాడు ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు