Mrunal Thakur Latest Movie : మాస్ రాజా తో మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Latest Movie

టాలీవుడ్ ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ జోరు గట్టిగ నడుస్తుందనే చెప్పాలి. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఒకటి రెండు అవకాశాలు కోల్పోతున్న కూడా, మృణాల్ ఠాకూర్ ఆడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెనే కావాలంటున్న హీరోలు, దర్శకులు లేకపోలేదు.

ఇక విషయానికొస్తే మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా పరుశరాం డైరెక్షన్ లో వస్తోన్న మరో సినిమాలోను ఆమె నటిస్తుంది. ఇక ఈ సినిమాలతో పాటు మాస్ మహారాజ్ రవితేజ తో కూడా నటించే అవకాశం కొట్టేసిందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే హ్యాట్రిక్ కాంబినేషన్ గా పేరున్న రవితేజ- గోపీచంద్ మలినేని కలిసి మరోసారి ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందించబోతున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని రాబోయే ఈ సినిమాలో రవితేజ కు జోడిగా మృణాల్ ఠాకూర్ ను తీసుకోబోతున్నట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పలు ప్రాజెక్ట్ లతో ఆమె బిజీగా ఉంటోందని ముందే ఇప్పటి నుంచే ఆమె డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట మేకర్స్. తొందరలోనే ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని ఫిలిం నగర్ టాక్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు