Pawan kalyan new movie update: ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా ?

Pawan kalyan new movie update

ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. ఈ డైలాగ్ చెబుతున్నామంటే, ఎవరి గురించి మాట్లాడబోతున్నామో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదేనండి.. రియల్ లైఫ్‌లో ఫ్యాన్స్ తమ ఆరాధ్యదైవంగా కొలిచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి.

ఈ డైలాగ్ లో ఈశ్వరా అని ఉంటుంది. కానీ, పవన్ ఎప్పుడు ఈశ్వరుడి పాత్రలో కనిపించలేదు. అంటే ఖచ్చితంగా దేవుడి పాత్రలో కనిపించలా..అనేది ముఖ్య ఉద్దేశ్యం కాకపోయిన ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వైఖరి మాత్రం ఇలాగే ఉంటూ వస్తుంది. స్టార్ హీరోల సినిమాలంటేనే లార్జర్డెన్ లైఫ్ కాన్సెప్ట్ లతో ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ లార్జర్డెన్ లైఫ్ కాన్సెప్ట్ లను మించి, ఇటీవల కాలంలో దేవుడి పాత్రలలో నటిస్తున్నాడు.

ఇక అసలు విషయానికొస్తే గతంలో బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ ఐన ఓ మై గాడ్ అనే సినిమా తెలుగులో గోపాల గోపాల అనే పేరుతో పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కిశోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ నాస్తికుడిగా, పవన్ కళ్యాణ్ దేవుడిగా నటించారు. ఇక ఈ సినిమా హిందిలో హిట్టైన విధంగానే తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది.

- Advertisement -

అయితే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కొంచెం అటు ఇటుగా గోపాల గోపాల తరహాలో ఉండే బ్రో సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా తమిళ్ లో సూపర్ హిట్టైన వినోదయ సీతాం రీమేక్. ఇక ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించాడు. దీనిబట్టి చూస్తే తొందర్లోనే పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించే సూచనలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అదెలా అనుకుంటున్నారా.. ?

లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఓ మై గాడ్ సినిమాకు పార్ట్ 2 వస్తోంది. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఈశ్వరుడిగా కనిపించబోతున్నారు. ఇటీవలనే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇక సినిమా గనక హిట్ అయితే పవన్ కళ్యాణ్ కు నెక్స్ట్ సినిమాకు స్క్రిప్ట్ దొరికినట్టే అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనడానికి కూడా టాలీవుడ్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. మరీ ఇదే గనక నిజమైతే ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. డైలాగ్ సఫలీకృతం అయినట్టే.. !

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు