Vishwak sen marriage: విశ్వక్ సేన్ పెళ్లి వార్తలో నిజమెంత ?

Vishwak sen marriage update

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు నిన్న సాయంత్రం తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విశ్వక్ సేన్ ఇలా ప్రకటించిన దగ్గర నుండి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

ఇటీవలనే యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి, వరుణ్ తేజ్ నిశ్చితార్థం వరుసగా జరగటంతో విశ్వక్ సేన్ పెళ్లి వార్త కూడా నిజమేనని కథనాలు వెలుబడుతున్నాయి. అయితే గతంలో కూడా విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్స్ కోసమని ఇలాగే పలు పోస్ట్ లు వేసి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయడంతో విశ్వక్ పెళ్లి వార్త కూడా తన రాబోయే సినిమాకి సంబందించిన ప్రమోషనల్ స్టంట్ అంటూ మరికొందరు తేల్చేస్తున్నారు. దాంతో విశ్వక్ సేన్ పెళ్లి వార్తలో నిజమెంత అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.

అయితే నిజానికి ఈ పెళ్లి వార్త అటు సినిమా ప్రమోషన్ కాదని, అలాగే నిజంగానే విశ్వక్ పెళ్లి కూడా చేసుకోవడం లేదని సమాచారం అందుతోంది. మరి ఈ రెండు కాకా విశ్వక్ సేన్ అలాగా పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎందుకు ప్రకటించినట్టు అని అనుకుంటున్నారా. అయితే.. అసలు నిజం ఏంటంటే విశ్వక్ సేన్ ఇటీవలనే ఆహా ఓటిటిలో ఒక ఫ్యామిలీ షో చేయడానికి ఒకే చెప్పినట్టు సమాచారం అందుతోంది. కానీ విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తుండటం వల్ల ఈ షో గతకొద్ది రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది.  ప్రస్తుతం విశ్వక్ చేస్తున్న అన్నీ సినిమాలు షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఆహా లో ఆయన షో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ షో ప్రమోషన్ కోసమే విశ్వక్ సేన్ ఈ విధంగా పోస్ట్ చేసినట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు