Vishwak Sen’s digital debut: హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వనున్న విశ్వక్ సేన్ ?

Vishwak Sen’s digital debut

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తొందర్లోనే ఒక రియాలిటీ షో కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇటీవలనే దాస్ కా ధమ్కీ సినిమాలో తన పర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసిన విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇప్పటికే ఆయన హీరోగా చేస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉండగా, ఒక సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇక లేటెస్ట్ గా విశ్వక్ సేన్ ఒక ప్రముఖ ఓటిటి సంస్థలో ఒక రియాలిటీ షో చేయడానికి గాను సైన్ చేసాడు. అయితే మరి ఇంతకీ ఆ షో ఏంటో తెలుసా ?

వివరాల్లోకి వెళ్తే.. విశ్వక్ సేన్ తన సినిమాల ద్వారా, సినిమా ప్రమోషన్స్ ద్వారా ఎంత హడావుడి చేస్తాడో అందరికి తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ కు ఉందంటే చాలు కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడు. ఆయన సినిమా జనాలకు రీచ్ అవడానికి అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తాడు. అయితే సాధారణంగా ఒక రియాలిటీ షో కు హోస్ట్ చేయడానికి కావాల్సింది కూడా హడావిడి చేయడమే కాబట్టి విశ్వక్ సేన్ హోస్ట్ అయితే బాగుంటుందని ఆ ప్రముఖ సంస్థ భావించినట్టు ఉందని తెలుస్తోంది. అది కాక విశ్వక్ సేన్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటం వల్ల యూత్ కూడా ఈ షో కు అట్రాక్ట్ అవుతారు.

- Advertisement -

అయితె మ్యాటర్ ఏంటంటే త్వరలోనే తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన ఆహా లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒక షో చేయనున్నాడు. కాగా మరి ఇది బిగ్ బాస్ తరహా రియాలిటీ షో నా, లేక అన్స్టాపబుల్ తరహా సెలెబ్రెటీ ఇంటర్వ్యూల షో నా అనేది తెలియాల్సి ఉంది.

దాదాపు 15 ఎపిసోడ్స్ వరకు ఈ షో ఉండబోతుందట. ఆహా ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచి ఆహా కు మరింత రీచ్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆహా యాజమాన్యం ఈ స్టెప్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే షో కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా ఏమి వెల్లడి పరచని ఆహా టీం. విశ్వక్ సేన్ తొందర్లోనే షో చేయబోతున్నాడనే విషయాన్ని మాత్రం అఫీషియల్ గా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది.

heck Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు