BIG breaking : గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కు శుభవార్త

Game of Thrones latest update

ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన గేమ్ అఫ్ త్రోన్స్ టెలివిజన్ సిరీస్ గురించి తెలియని ఉండరు. అమెరికన్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించి అత్యంత పాపులర్ అయిన టివి సిరీస్ లలో ఒకటిగా నిలిచింది.

2011లో ప్రారంభమైన ఈ షో 2019 వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. ఇంగ్లీష్ మాధ్యమంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ షో ను తొందర్లోనే సౌత్ ఇండియన్ భాషాలైనా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేస్తునట్టు సమాచారం అందుతోంది. చాలా రోజులుగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోను తెలుగు డబ్ చేయాలనీ ప్రేక్షకుల దగ్గర నుండి డిమాండ్ వస్తుండటంతో ఫైనల్ గా ఈ షోను తెలుగులో డబ్ చేయడానికి జియో సినిమాస్ అంగీకరించింది.

మొన్నటి వరకు డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ కొద్దీ రోజుల క్రితమే హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ నుండి తొలగించబడింది. ప్రస్తుతం జియో సినిమాస్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ షో తెలుగు డబ్బింగ్ తో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ షో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే జియో సినిమాస్ ప్రకటించనుంది. ఇది నిజంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమాలుకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు