Prabhas’s Kalki 2898 AD: కల్కి లో డుల్కర్ – హింట్ ఇదిగో..!

Prabhas’s Kalki 2898 AD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా ప్రతిష్టాత్మకంగా కల్కి 2898AD సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండే తారాస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రిలీజైన ఈ సినిమా గ్లిమ్ప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఇప్పుడు హీరో డుల్కర్ సల్మాన్ కూడా మరో కీలక పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న డుల్కర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కల్కి సినిమా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో సైఫై థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్,కమల్ తో పాటుగా మరికొంత మంది స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో మీడియా ఇదే అంశంపై డుల్కర్ ప్రశ్నించగా కల్కి సినిమాలో తాను నటిస్తున్నానా లేదా అన్నది తాను చెప్పటం కంటే సినిమా యూనిట్ చెప్తే బాగుంటుందని అన్న డుల్కర్. కల్కి సినిమా అద్భుతంగా ఉండబోతుందని, నాగ్ అశ్విన్ కి తప్ప మరెవరికి అలాంటి ఆలోచన రాదనీ అన్నాడు.

కల్కి సినిమా కథ గురించి, డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ఇంతగా చెప్పాడంటే సినిమాలో కచ్చితంగా డుల్కర్ కీలక పాత్రలో నటించనున్నాడని కామెంట్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో డుల్కర్ నటించిన మొదటి తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియెన్స్ కి దగ్గర కావటమే కాకుండా పాన్ ఇండియా హిట్ కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో కల్కి సినిమాలో డుల్కర్ నటిస్తున్నాడా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు