Superstar’s Jailer: జైలర్ కి నిజంగా అంత సీనుందా?, లేక మనోళ్లు అతి చేస్తున్నారా..?

Superstar’s Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్లో రూపొంది ఇటీవలే రిలీజైన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. జైలర్ రిలీజైన తర్వాత రోజు వచ్చిన చిరంజీవి భోళాశంకర్ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో జైలర్ కి మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి. భోళాశంకర్ సినిమా రొటీన్ మాస్ మసాలా కథతో రూపొంది ఔట్ డేటెడ్ టేకింగ్ తో డిజాస్టర్ అయినప్పటికీ చిరంజీవి లుక్స్ పరంగా, సాంగ్స్ లో గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో యాక్షన్ సీన్స్ లో ఎనర్జిటిక్ గా కనిపించటంతో ఫ్యాన్స్ కొంత మేరకు సాటిస్ఫై అయ్యారనే చెప్పాలి.

అయితే, సినిమా రిలీజ్ కి చిరు చేసిన కామెంట్స్ వల్ల సెక్షన్ ఆఫ్ మీడియా, అండ్ ఆడియెన్స్ కావాలని పనిగట్టుకొని భోళాశంకర్ పై నెగిటివిటి స్ప్రెడ్ చేశారు. దీంతో కనీసం బిలో యావరేజ్ గా మిగలాల్సిన సినిమా ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వటం వల్ల డిజాస్టర్ అయ్యింది. నిజానికి జైలర్ సినిమా కథ కూడా అంత గొప్పదేమీ కాదు, రజినీకాంత్ స్టైల్, స్వాగ్ ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ లో డైరెక్టర్ ఎలివేట్ చేయటం, అందుకు తగినట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వటం వల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటం వల్ల తెలుగులో మార్కెట్ కూడా తగ్గింది. ఇప్పుడు జైలర్ సినిమాకి పాజిటివ్ రావటంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. యూఎస్ లో కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న జైలర్ 4మిలియన్ మార్క్ కి చేరువలో ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 4రోజులకు గాను 30కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఒక వర్గం అభిమానులు మీడియా పనికట్టుకొని నెగిటివిటి స్ప్రెడ్ చేయటం వల్లే జైలర్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయని, అంతా మనోళ్లు చేసిన అతి వల్లనే అని కొంతమంది మెగాఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు