Manchu family: 140 కోట్లతో మంచు విష్ణు, మోహన్ బాబుల కొత్త సినిమా

Manchu vishnu pan indian movie

నిత్యం ఏదో ఒక వార్తతో మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో మరియు న్యూస్ చానెల్స్ లో ట్రెండ్ అవడం చూస్తూనే ఉన్నాం.అయితే గతకొద్ది కాలంగా మాత్రం ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సైలెంట్ గా ఉంటున్న మంచు ఫ్యామిలీ.. లేటెస్ట్ గా మరో సంచలన వార్తతో మరోసారి ట్రేండింగ్ లోకి వచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది అందేంటంటే ఎప్పుడు వివాదాలకు సంబందించిన విషయాలలోనే వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీ మొదటిసారి ఒక సినిమా ఎనౌన్స్ మెంట్ తో వార్తల్లో నిలుస్తుంది.

వివరాల్లోకి వెళ్తే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి త్వరలోనే ఒక భారీ పాన్ ఇండియన్ సినిమాలో కలిసి నటించబోతున్నారట. అయితే ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 140 కోట్లని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గతంలో మా ఎన్నికల సమయంలో మరియు మంచు విష్ణు హీరోగా నటించిన గత చిత్రమైన జిన్నా సినిమా ప్రమోషన్స్ సమయంలో మంచు విష్ణు, మోహన్ బాబుతో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఇక ప్రస్తుతం ఆ భారీ చిత్రానికి ఈ నెలలోనే ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతోంది.

మంచు విష్ణు, మోహన్ బాబు కలిసే నటించే భారీ పాన్ ఇండియా సినిమాకి సంబంధించిన డైరెక్టర్ మరియు ఇతర నటి నటుల గురించి ఎలాంటి ఇంఫార్మేషన్ లేకపోయిన ఈ సినిమాకి సంబంధించి ఆగస్ట్ 18న శ్రీకాళహస్తి టెంపుల్ లో ఆఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ చేయనున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అసలు మంచు విష్ణుకి తెలుగులో 10 కోట్ల మార్కెట్ కూడా లేదు. ఇక మోహన్ బాబు గురించి ఆయన చేస్తున్న సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరి ఇలాంటి సమయంలో 140 కోట్ల బడ్జెట్ తో తండ్రి కొడుకులిద్దరూ కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారంటే అంటే సాహసమనే చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు