House of Manchus: మంచు ఫ్యామిలీ చీప్ పబ్లిసిటీ.. పరువు మొత్తం గోవిందా !

తెలుగు సినిమా పరిశ్రమలో మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, ఉప్పలపాటి కుటుంబాలకు మంచి పేరు ఉంది. అలాగే ఈ లిస్ట్ లో మంచు ఫ్యామిలీకి కూడా ఓ స్థానం ఉంది. మంచు ఫ్యామిలీ గౌరవాన్ని మోహన్ బాబు 1975 నుంచి నిర్మిస్తూ, కాపాడుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్ లో 570కి పైగా సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. పద్మ శ్రీతో పాటు ఇంకెన్నో అవార్డులను అందుకున్నాడు. ఆయన కూమారుడు మంచు విష్ణు ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నాడు.

ఇంతటి ఉన్నత స్థానంలో ఉన్న ఈ కుటుంబం ప్రస్తుతం ట్రోల్స్ కు స్టఫ్ గా మారిపోయింది. దీనికి కారణం.. వారే అని చెప్పొచ్చు. వారు మాట్లాడే మాటలు, చేసే పనులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతునే ఉంటారు. అయితే ఈ కుటుంబం దీని నుంచి బయట పడేలా ప్రయత్నించాలి. కానీ, ఇటీవల వీరు చేసిన ఒక పనికి ట్రోలర్స్, నెటిజన్లు మరింత రెచ్చిపోయి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మనోజ్.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి, తనకు విష్ణు మధ్య విభేదాలు ఉన్నాయని, విష్ణు తనపై దాడికి వచ్చాడని చెప్పాడు.

అది టాలీవుడ్ పెద్ద సంచలనంగా మారిపోయింది. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు అంటూ దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్, వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. కానీ, తాజాగా విష్ణు.. తాము హౌస్ ఆఫ్ మంచుస్ అనే రియాలిటీ షో చేస్తున్నామని, అందులో భాగంగానే మనోజ్ ఆ వీడియోను పోస్ట్ చేశాడని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ప్రకటనతో తమ రియాలిటీ షోకు పబ్లిసిటీ వస్తుందని మంచు ఫ్యామిలీ అనుకున్నారు. కానీ, ఇప్పుడు చూస్తే.. అది పబ్లిసిటీ కాదు.. చీఫ్ పబ్లిసిటీ అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

- Advertisement -

పబ్లిసిటీ కోసం ఫ్యామిలీ మొత్తం ఇంత నీచంగా దిగజారుతారా అంటూ మండిపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ తన సినిమా కోసం రోడ్డుపై ఒక చిన్న చీప్ ప్రాంక్ చేస్తేనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఇంత చిన్న దాన్ని గ్రహించక, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను వెర్రి వాళ్లను చేసేలా మంచు ఫ్యామిలీ ఈ నాటకం ఆడటంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ సంఘటనతో మంచు ఫ్యామిలీ ఎప్పుడు కూడా మంచి ఫ్యామిలీ కాలేదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు