NTR30: ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్‌తో పాటు మరో క్రేజీ హీరోయిన్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న తాజా చిత్రం NTR30. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి ఆచార్య వరకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో ఇప్పటి వరకు ఆచార్యతో కలిపి ఐదు సినిమాలు ఉన్నాయి. ఆచార్య మినహా 4 సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఇమేజ్ చాలా వరకు తగ్గింది.

ఇప్పుడు ఎన్టీఆర్ తో వస్తున్న NTR30తో మళ్లీ తన ఇమేజ్ ను తిరిగి సంపాదించుకోవాలని కొరటాల చూస్తున్నాడు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. శుక్రవారం నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ రంగులను కొరటాల అద్దుతున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తో పాటు ఇంక పలువరు బెస్ట్ టెక్నిషియన్స్ ను డైరెక్టర్ సెలక్ట్ చేసుకున్నారు.

కాగా, ఇందులో హీరోయిన్ గా దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. NTR30లో జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్ పాత్ర ఉండబోతుందట. దీనికి ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని డైరెక్టర్ కొరటాల శివ ఎంపిక చేశాడని తెలుస్తుంది. కృతి శెట్టి పాత్ర తక్కువ సమయమే ఉన్నా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్. అయితే ఇప్పటికే ఈ చిత్రంలో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే ఫహాద్ ఫాజిల్ కూడా ఒక కీ రోల్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇలా భారీ తారగాణంతో కొరటాల అద్భుతం చేయడానికి రెడీ అవుతున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు