Dasara: బాక్స్ ఆఫీస్ కొట్టేసాడు నాని

నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. ఈ సినిమా తెలంగాణ లోని గోదావరి ఖని దగ్గర ఉన్న సింగరేణి కాల్ మైన్స్ ప్రాంతానికి చెందిన ఓ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా లో నాని సరసన కీర్తి సురేష్ రెండవ సరి నటించింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమా ప్రమోషన్లలో నాని, కీర్తి సురేష్ చురుక్కా పాల్గొని సౌత్ మరియు నార్త్ ప్రాంతాల్లో కూడా ప్రమోషన్లు చేసారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించని మాస్ లుక్ లో కనిపించారు. ఈ సినిమా కథ అంతా కీర్తి సురేష్ [వెన్నెల] చుట్టూనే తిరుగుతుంది అని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పటం తో ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా మార్చ్ 30 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ సినిమా రాబట్టలేనంత కలెక్షన్లతో, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే మొదటి సారి దసరా సినిమా 38కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. ఇది నాని కెరీర్ లోనే కాక సినీ చరిత్రలోనే చెరగని ముద్ర వేసుకుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు