Rakesh: పెళ్లయిన నెల రోజులకే జబర్దస్త్ జంట మధ్య విభేదాలా..?

జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందిన రాకింగ్ రాకేష్ తన ప్రేయసి జోర్దార్ సుజాతను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 24న వీరి వివాహం తిరుమలలో ఘనంగా జరిగింది. నిజానికి జబర్దస్త్ లో మనకు జంటగా కనిపిస్తూ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ అనుమానం కలిగించేలా నటీనటులు నవ్విస్తుంటారు.

దీంతో రాకేష్, సుజాతల మధ్య కూడా అలాంటి ప్రేమే ఉందని భావించారు. కానీ వీరిద్దరూ సీరియస్ గానే లవ్ లో ఉన్నారని తర్వాత అర్థమైంది. ఇద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ జబర్దస్త్ లో స్కిట్లు చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే పెళ్లి జరిగి నెల కూడా తిరగకుండానే రాకేష్, సుజాత మధ్య విభేదాలు వచ్చాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ స్కిట్ లో భాగంగా సుజాత పై రాకింగ్ రాకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నువ్వు సుజాతని మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నావా? అని అడగగా.. అవును మాది పవిత్రమైన ప్రేమ అని సుజాతను పొగుడుతూనే.. వెంటనే “బొంగులో లవ్ ప్రేమించేదాకా ప్రేమ అని వెంటపడుతుంది. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెట్టింది” అంటూ రాకేష్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాకేష్ చేసిన ఈ వ్యాఖ్యలకు సుజాత ఒక్కసారిగా షాక్ అయింది. ఈ స్కిట్ చూసిన కొంతమంది స్కిట్స్ కోసం తమ సంసార జీవితాన్ని హేళన చేసుకోవడం మంచిది కాదని కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు